ఇదేం పోయేకాలం.. కూతురి అంత్యక్రియలకు అందంగా ముస్తాబైన లేడీ ఇన్‌ఫ్లుయెన్సర్..
https://www.instagram.com/reel/C-1hKQdMrfH/?utm_source=ig_web_copy_link
ఆ వీడియోలో ఆమె నవ్వుతూ, పొల్కా డాట్స్ డ్రెస్‌లో తిరుగుతూ కనిపించడం చూసి లక్షలాది మంది అభిమానులు షాక్‌కు గురయ్యారు. "నా పెళ్ళికి రెడీ అయినట్లే నా బిడ్డ అంత్యక్రియలకు ముస్తాబవుతున్నా" అని ఆమె తన వీడియోలో రాసింది. అదే స్థలంలో తన పెళ్లి దుస్తుల్లో ఉన్న తన ఫొటోను కూడా వీడియోలో చూపించింది. కేవలం రెండు రోజుల క్రితం పంచుకున్నప్పటి నుంచి విడర్ పోస్ట్ ఆన్‌లైన్‌లో విపరీతంగా వైరల్ అయింది. 12 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కామెంట్లను ఆఫ్ చేసినప్పటికీ, వివాదం మాత్రం తగ్గలేదు.
ఒక రెడిట్ యూజర్ ఈ వీడియోలోని ఆమె ఫోటోను క్యాప్చర్ చేసి ఇప్పుడు నీ ఏం చూశాను, ఈ మహిళ ఇలా ప్రవర్తిస్తుందేంటి అని ఓ క్యాప్షన్‌తో పోస్ట్ చేసాడు అప్పటినుంచి ఈ మహిళను చాలామంది తిట్టిపోస్తున్నారు. నా బిడ్డ చనిపోతే ఎవరైనా ఏడుస్తూ ఉంటారు కానీ ఈమె అందంగా తయారవుతుంది ఏంటి అని, ఏం పోయేకాలం అని చాలామంది తీవ్రంగా విమర్శిస్తున్నారు.
"ఈ పోస్ట్ చూసి నాకు చాలా కోపం వచ్చింది. ఇటీవల ఒక భారతీయ జంట తమ చనిపోయిన బిడ్డను అంత్యక్రియలకు తీసుకెళ్తున్న వీడియోను రీల్స్‌లో చూశాను. ఇలా చేయడం ఎలా సరైనది? కొన్ని లైక్‌లు, కామెంట్‌ల కోసం ప్రజలు తమ మనస్సు, మేధస్సు అన్నీ కోల్పోయారా?" అని ఒక యూజర్ రాశాడు. అయితే కొంతమంది ఆమె దుఃఖం వ్యక్తం చేస్తూనే పైకి మాత్రం నవ్వుతూ ఉంది అని సపోర్ట్ చేశారు. అయితే "దీనిని దుఃఖం అంటున్నారు కదా, మీరు కూడా దుఃఖంలో ఉన్నప్పుడు వీడియోలు తీసి పోస్ట్ చేస్తారా?" అని ఒక వ్యక్తి వాదించాడు. మొత్తం మీద సోషల్ మీడియా పుణ్యమా అని ప్రజలు పిచ్చి వాళ్ళు అవుతున్నారు అని ఈ వీడియోతో తెలిసిపోయిందని చాలామంది కామెంట్ చేస్తున్నారు.