పెళ్లిమండపంలోకి యాసిడ్‌తో ఎంట్రీ ఇచ్చిన లవర్.. షాకింగ్ ట్విస్ట్
రైల్వే కోడూరుకు చెందిన సయ్యద్ బాషా అనే వ్యక్తికి నందలూరులో మ్యారేజ్ జరుగుతోంది. ఇంతలో తిరుపతికి చెందిన మరో యువతి అక్కడ ప్రత్యక్షం అయ్యింది. తనతో పదేళ్లుగా బాషా వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజుల నుంచి బాషా కనిపించకుండా పోయాడని, అతన్ని వెతుక్కుంటూ రైల్వే కోడూరుకు వచ్చి ఆరా తీసినట్లు తెలిపింది. అప్పుడే తన లవర్‌కి వేరే అమ్మాయితో పెళ్లి జరుగుతుందనే విషయం తెలిసి షాక్ అయ్యానని, అందుకే నేరుగా నందలూరులోని పెళ్లి మండపానికి వచ్చినట్లు తెలిపింది.
బంధువుల సమక్షంలో తనను మోసం చేసిన విషయం చెప్పి నిలదీసింది. ఈ నేపథ్యంలో ఘటనా స్థలంలో ఘర్షణ జరిగింది. ఇక చేసేదేమీ లేక తన వెంట తెచ్చుకున్న యాసిడ్, కత్తితో యువతి బాషాపై ఆ యువతి దాడి చేసింది. బంధువులు ఆమెను అడ్డుకున్నా ఆగలేదు. తోపులాట వల్ల వరుడి పక్కనే ఉన్న కరిష్మా అనే మహిళ ముఖంపై యాసిడ్ పడిపోయింది. ఆ క్రమంలో బాషా కత్తితో ఆ యువతిపై దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన ఆ యువతి ప్రస్తుతం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేశారు. ఇరు వర్గాల ఫిర్యాదుతో పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.