షాక్: ఉద్యోగాల కోసం అమెరికాకు వెళుతున్నారా.. కష్టాలలో పడ్డట్టే..?

Divya
చాలామంది ఇతర దేశాలకు వెళ్లి బాగా సంపాదించుకొని అక్కడ ఉద్యోగం చేసుకోవాలని ఆలోచనలో ఉంటారు. అలా ఇప్పటికే చాలామంది కూడా వెళ్లడం జరిగింది. అయితే ఇప్పుడు అమెరికా వంటి ప్రాంతాలలో సంక్షోమం ఆరంభమైందట. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో అక్కడ ఉన్న వారిలో కేవలం ఒక్కరికే ఉద్యోగం ఉండే పరిస్థితి మొదలయ్యిందట. రాబోయే రోజుల్లో మరింత దీన పరిస్థితికి రాబోతోందని సమాచారం. ముఖ్యంగా Ai ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ రావడం వల్ల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పుడు తాజాగా న్యూస్ పేపర్లలో కూడా ఇలాంటి న్యూస్ వస్తూనే ఉన్నాయి. అమెరికాలో గత రెండున్నర దశాబ్ద కాలంలో ఎప్పుడూ చూడనంత నిరుద్యోగం ఏర్పడిందట. ఏడేళ్లుగా ఉద్యోగం చేస్తున్న సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా చాలా మందిని తొలగిస్తున్నాయట. చాలామంది హోటల్స్ లో గ్యాస్ స్టేషన్లలో కూడా పనిచేస్తున్నారట. 2022 ,23 సంవత్సరంలో దాదాపుగా 2 లక్షల మందికి పైగా వెళ్ళగా ఇందులో తెలుగు విద్యార్థులు 40 నుంచి 50 వేల మంది వరకు ఉన్నారట. అయితే గడచిన ఐదేళ్ల క్రితం వరకు ఎమ్మెస్ ఆఫీస్ చేసిన 85 శాతం మంది ఉద్యోగాలు సంపాదించుకోవడం జరిగింది.

గతంలో రెండు సార్లు లాక్ డౌన్ విధించడం వల్ల అమెరికాలో సంక్షోభం చాలా పెరిగిపోయిందట. వీటిని పూడ్చడానికి అమెరికా ప్రభుత్వం  ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించడంతో చాలా కంపెనీలు బయటపడ్డాయి. ఒక ఉద్యోగస్తులను కూడా అదే స్థాయిలో తీసుకోవడం జరిగింది. కరోనా తగ్గిపోయిన తర్వాత అమెరికా ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలను నిలిపివేసింది. పారిశ్రమక రంగం మాత్రం పెద్దగా పుంజుకోలేకపోయింది. దీంతో రుణాలు కూడా తిరిగి పొందలేకపోవడంతో బ్యాంకులు కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. బ్యాంకులు కూడా రుణాలు ఇవ్వడం మానేశాయట. ఇక వడ్డీ రేటును కూడా నాలుగు శాతం నుంచి ఏడు శాతానికి పెంచేసిందట. అమెరికా చరిత్రలోనే ఇంతటి వడ్డీ రేట్లు ఎన్నడూ లేవని విధంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా కోవిడ్ సమయంలో చేర్చుకున్న ఉద్యోగస్తులను 2023 మార్చి నుంచి తొలగించారట. అధిక జీతాలను పొందుతున్న వారందరినీ కూడా తీసేయడం జరుగుతోందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: