నిరుద్యోగులకు కీలక అలర్ట్ ప్రకటించిన రైల్వే శాఖ..!!

Divya
ఎన్నికల ముందు ఎన్నో ప్రభుత్వాలు సైతం ఉద్యోగ ప్రకటనలు విడుదల చేస్తూనే ఉండడం చాలా ఆనవాయితీగా వస్తోంది .ముఖ్యంగా నిరుద్యోగులు కూడా ఉద్యోగ ప్రకటనల కోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు.ఇలాంటి సమయంలో నిరుద్యోగ బలహీనతలను ఆసరాగా ఉపయోగించుకొని కొంతమంది కేటుగాళ్లు మోసాలకు పాల్పడుతూ ఉంటారు.. అలా ఇప్పటికే ఎన్నో ఫేక్ నోటిఫికేషన్లు సైతం విడుదల అవుతూ ఉన్నాయి.. త్వరలోనే దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సమయంలో నిరుద్యోగుల్ని మోసగించే ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

ఇలాంటి ప్రకటనలను సైతం కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇస్తోంది రైల్వే శాఖలో 4,660 పోలీస్ ఉద్యోగాలు అంటూ గత కొద్దిరోజులుగా ఒక నోటిఫికేషన్ వైరల్ గా మారుతోంది. పోలీస్ ఉద్యోగాలు అంటూ గత కొద్దిరోజులుగా ఒక నోటిఫికేషన్ వైరల్ గా మారుతోంది.. ఈ ఉద్యోగ ప్రకటన పైన కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.. ఆ ఉద్యోగ ప్రకటన నకిలీ అంటూ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో ఎస్సై కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 15 నుంచి మే 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ విస్తృతంగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఖండించారు.

ఈ మధ్యకాలంలో ఎలాంటి ఉద్యోగ ప్రకటనలను రైల్వే శాఖ మంత్రి విడుదల చేయలేదని కేంద్రం తెలియజేస్తుంది..RPF లో 452 ఎస్సై ఉద్యోగాలు..4,208 కానిస్టేబుల్ ఉద్యోగాలు వేతనం వయోపరిమితి విద్యార్హతలు దరఖాస్తు ప్రక్రియ రుసుము ఇలా అంశాలతో కూడిన నకిలీ ప్రకటనను విడుదల చేయడంతో ఎవరు ఇలాంటి ప్రకటనలను నమ్మవద్దని నిరుద్యోగులకు సైతం కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఏవైనా నోటిఫికేషన్లు ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ప్రకటన చేసే విడుదల చేస్తామంటూ లేకపోతే అధికారిక వెబ్సైట్ను కూడా సందర్శించాలంటూ తెలియజేస్తోంది.. అయితే నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురుచూసిన ఈ రైల్వే ఉద్యోగాలు ఫేక్ అని తెలియడంతో కాస్త నిరాశతో ఉంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: