రైతులు వరి కోస్తుండగా అక్కడికి వచ్చిన నెమలి.. ఏం చేసిందో చూడండి?

praveen
ప్రకృతి లోని మిగతా జంతువులకు మనుషులకి మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది అని చెప్పాలి. అయితే  అడవులను నరికేసి ఎంతోమంది భవనాలను నిర్మించుకోవడంతో ఇలాంటి సంబంధం దెబ్బతింటుంది. కానీ ఇప్పటికీ గ్రామాల్లో ఏకంగా పక్షులు జంతువులతో మనుషులు మంచి సంబంధాలను కొనసాగిస్తూ ఉంటారు. ఏకంగా స్నేహితుల్లాగా కలిసి మెలిసి ఉంటారు అని చెప్పాలి. అయితే ఇలాంటివి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వెలుగులోకి వస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.

 ప్రకృతి యొక్క గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా చేస్తూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. సాధారణంగా జాతీయ పక్షి నెమలిని చూడాలి అంటే పట్టణవాసులు అందరూ కూడా జూపార్కు వెళ్లడం లాంటివి చేస్తూ ఉంటారు. అక్కడ చెరలో బంధించి ఉన్న నెమలిని చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటారు. అదే పల్లెటూర్లలో అయితే ఉదయం లేచి చూసాము అంటే చాలు చుట్టుపక్కల చాలా చోట్ల ఇలాంటి నెమళ్లు దర్శనమిస్తూ ఉంటాయి. ఇక ఈ నెమల్లు కొంతమందితో స్నేహం చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటాయి.

 అయితే ఇక్కడ ఒక నెమలి ఇలాగే ఏకంగా మనుషులతో స్నేహం చేసింది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే వరికోస్తున్న రైతులకు సహాయం చేయడానికి వచ్చింది నెమలి. ఒకవైపు రైతులు వరి కోత కోస్తూ ఉండగా అక్కడికి వచ్చిన నెమలి ఏకంగా అక్కడ ఉన్న పురుగులను తింటూ వారికి పురుగు పట్టకుండా పూర్తిగా క్లీన్ చేసేస్తూ ఉంది. సాధారణంగా అయితే నెమలి మనుషులను చూస్తేనే పారిపోతాయి. కానీ ఈ నెమలి మాత్రం వరి కోత సమయంలో ఇక రైతులకు దగ్గరగా ఉండటం గమనార్హం. ఇక ఈ వీడియో చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీడియో పై ఒక లుక్ వెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: