వైరల్: మరో 3రోజులపాటు సంక్రాంతి సెలవులు పెంపు..!!

Divya

ఆంధ్రప్రదేశ్లోని సంక్రాంతి సెలవులు ఈ రోజుతో ముగిసి ఉండగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొకసారి మూడు రోజులపాటు పెంచుతూ సెలవులను ప్రకటించడం జరిగింది. దీంతో ఈ నెల 22వ తేదీన పాఠశాలలకు తిరిగి ఓపెన్ కాబోతున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సైతం విజ్ఞప్తి మేరకె ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లుగా విద్యాశాఖ తెలియజేయడం జరిగింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ పలు రకాల ఆదేశాలను కూడా జారీ చేశారు.

తెలుగు రాష్ట్రాలలో అత్యంత చాలా గ్రాండ్గా జరుపుకునే పండుగలు సంక్రాంతి మొదటి పండుగ కాబట్టి ఈ పండుగకు స్కూల్స్ కాలేజీలు ఎక్కువ రోజులు సెలవులు వస్తూ ఉండేది.. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీ సర్కార్ విడుదల చేసిన అకాడమిక్ క్యాలెండర్ ప్రకారమే జనవరి 11 నుంచి 16వ తేదీ వరకు మాత్రమే సంక్రాంతి సెలవులను ప్రకటించారు.. కానీ దీనిపైన ఏపీ ఉపాధ్యాయ సంఘాలు పలు రకాల అభ్యంతరాలను తెలియజేయడంతోపాటు గతంలో కనీసం 10 రోజుల పాటు ఈ సంక్రాంతి సెలవులు వస్తూ ఉండేవని ఇప్పుడు మారిన పరిస్థితుల రీత్యా సెలవులు తగ్గించడం సరికాదంటూ కూడా తెలియజేశారు.

ఈ మేరకు ఒక విన్నపాన్ని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ని కోరడం జరిగింది.. దీనిపైన సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం జనవరి 9 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ఉండేవిధంగా నిర్ణయించారు. అయితే 19వ తేదీన పాఠశాల పునః ప్రారంభం ఉండగా.. పండుగ అయిపోయిన వెంటనే పిల్లలు పాఠశాలకు రాలేరని తల్లిదండ్రులు ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేయడంతో మరో మూడు రోజుల పాటు ఈ సెలవులను సైతం పొడిగించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం మేరకు మరో మూడు రోజులపాటు స్కూల్స్ కాలేజీలకు సెలవు దినముగా ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: