షాక్: త్వరలోనే సానియా - షోయబ్ విడాకులు..!!

Divya
టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరొకసారి ఇప్పుడు వార్తలలో వినిపిస్తోంది. ఆమె త్వరలోనే విడాకులు తీసుకోబోతోంది అంటూ పలు రకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ ను ప్రేమించి మరి ఇమే వివాహం చేసుకుంది. పెద్దలను ఒప్పించి 2010లో అతడిని వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి ఇజాజ్ అనే కుమారుడు కూడా జన్మించారు. గత కొద్ది రోజులుగా సానియా మీర్జా , షోయబ్ వైవాహిక జీవితంలో సఖ్యత లేదని విడాకులు తీసుకోబోతున్నారంటూ రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ విషయం పైన ఎప్పుడూ కూడా వీరు స్పందించలేదు.

అంతేకాకుండా సానియా మీర్జా పాకిస్తాన్లో కన్నా ఇండియాలోనే ఎక్కువగా ఉంటుంది.తాజాగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి తన భర్త షోయబ్ తో కలిసి ఉన్న ఫోటోలను సైతం డిలీట్ చేసినట్లుగా తెలుస్తోంది. గతంలో కూడా షోయబ్ తన ట్విట్టర్ నుంచి రిలేషన్షిప్ స్టేటస్ ను సైతం సానియా మీర్జా పేరును రిమూవ్ చేశారు.. ఇప్పుడు తాజాగా ఇంస్టాగ్రామ్ లో కూడా డిలీట్ చేయడంతో సానియా-షోయబ్ మధ్య రిలేషన్ అంత బాగా లేకపోవడం వల్లే ఇలా చేశారంటూ కూడా వినిపిస్తున్నాయి. దీంతో ఈ జంట త్వరలోనే విడాకులు తీసుకోబోతుందని ఊహగానాలు కూడా వినిపిస్తున్నాయి.

అందుకు కారణం అమేషా అన్నట్లుగా గతంలో వార్తలు వినిపించాయి.. అయితే ఆమె మాత్రం ఈ విషయాలను కొట్టి పారేశారు పెళ్లైన వ్యక్తితో తాను ఎందుకు సంబంధం పెట్టుకుంటాను అంటూ ప్రశ్నించింది.. ఇటీవల సానియా కూడా ఒక పోస్టు చేసిన విషయంలో కూడా పలు రకాల అనుమానాలు వినిపిస్తున్నాయి.. అదేమిటంటే ఒక విషయంలో మనకు బాధ కలిగినప్పుడు దాన్ని దూరం చేసుకోవడమే మేలంటూ సోషల్ మీడియాలో సానియా పోస్ట్ షేర్ చేసింది.దీంతో కచ్చితంగా సానియా షోయబ్ జంట విడిపోతున్నారనే సంకేతాలు ఇవే అంటూ అభిమానులు సైతం తెలియజేస్తున్నారు . మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: