అడవిలో వెళుతుంటే.. సడన్ గా ఎదురొచ్చిన గొరిల్లా.. చివరికి?

praveen
సాధారణంగా గొరిల్లాలకు మనుషులకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని చెబుతూ ఉంటారు.  ఎందుకంటే గొరిల్లాలు అచ్చం మనుషులు చేసినట్లుగానే వాటి వాటి పనులు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని కొన్ని సార్లు అయితే మనుషుల్లాగే ఉండే గొరిల్లాల ప్రవర్తన ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. అయితే గొరిల్లాలు అటు మనుషుల కంటే ఎంతో దృఢంగా ఉంటాయి. అయితే ఇక వాటికి కోపం వచ్చిందంటే చాలు ఏకంగా నిమిషాల్లో  మనుషుల ప్రాణాలను తీసేయగలవు.

 అలాగని గొరిల్లాలు ఏకంగా మనుషులపై  దాడి చేసేంత క్రూరమైన జంతువులు కాదు అని చెప్పాలి. కానీ ఎప్పుడైనా అవి ఎదురు పడినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. అయితే జూలోకి వెళ్ళినప్పుడు ఇక బోన్ లో ఉన్న గొర్రెలను చూసినప్పుడు పెద్దగా భయం వేయదు. కానీ ఎక్కడికి అడవిలోకి వెళ్ళినప్పుడు గొరిల్లా ఎదురుపడితే ప్రాణం గాల్లో కలిసిపోతుంది అని చెప్పాలి. అయితే ఇటీవల కొంతమంది పర్యటకులకు ఇలాంటి ఒక భయంకరమైన  అనుభవమే ఎదురయింది.

 చాలామంది టూరిస్టులు అడవుల్లో తిరుగుతూ ఇక జంతువులను ఎంతో దగ్గరగా ఫోటోలు వీడియోలు తీస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో వారికి కొన్ని సార్లు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఇటీవల కొంతమంది టూరిస్టుల బృందం అడవిలో ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇంతలో అకస్మాత్తుగా వారికి ఒక భారీ గొరిల్లా ఎదురయింది. ఏకంగా వారి ఎదురుగానే నడుచుకుంటూ వచ్చింది. దీంతో టూరిస్టులు అందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. ఏకంగా గొరిల్లా తమ దగ్గరికి రాగానే అక్కడున్న వారందరూ కూడా కదలకుండా అలాగే ఉండిపోయారు. దీంతో వారి నుంచి ఎలాంటి హాని లేదు అని గ్రహించిన గొరిల్లా అక్కడి నుంచి వాళ్లని చూస్తూ నడుచుకుంటూ వెళ్ళింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: