సంక్రాంతి రోజున ఎవరెవరిని పూజిస్తారో తెలుసా..?

Divya
మకర సంక్రాంతి అంటేనే రైతుల పండగ అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.మకర సంక్రాంతిని సాధారణంగా మూడు రోజులు జరుపుకుంటాము. మొదటిరోజు భోగి,రెండో రోజు సంక్రాంతి,మూడో రోజు కనుమగా జరుపుకుంటాము.ఈ సమయంలో దేవతల అనుగ్రహాలు పుష్కలంగా దొరుకుతాయని, కావున కచ్చితంగా కొంతమందిని పూజించాలని పెద్దలు చెబుతూ వస్తూ ఉంతారు.దీని ద్వారా మనుషులకున్న ఎటువంటి పీడలు,కర్మలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు కలుగుతాయని సూచిస్తూ ఉన్నారు.మకర సంక్రాంతి సమయంలోనే భీష్ముడు వీరమరణం పొందేందుకు,స్వయంగా వేచి ఉండి,సూర్యుడి మకర సంక్రమణం జరిగిన తర్వాత ఉత్తరాయన కాలంలో మరణం పొందుతారు.అంతటి మహా శక్తి గల ఈ సమయంలో కచ్చితంగా కొన్ని రకాల పూజలు చేయాలని సూచిస్తూ ఉన్నారు.మరి అవేంటో తెలుసుకుందామా..
మకర సంక్రాంతి రోజున పగలు,రాత్రి సమానంగా ఉంటాయి.ఈ రోజు తరువాత పగటి సమయం,రాత్రుల కంటే ఎక్కువగాను మరియు వెచ్చగా మారుతుంది.ఈ పండుగ భారతదేశంలో పంటల సీజన్‌ను కూడా సూచిస్తుంది.ప్రజలు ప్రకృతి మాత బహుమతులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, పొలాలను పూజించాలి. దీని వల్ల వారు మరిన్ని పంటలు పండించేందుకు సహాయపడుతుంది కనుక.మరియు మనకు సూర్యుడు లేనిదే ఏ పంట కానీ,ఏ మనిషి కానీ బతకలేడు.కనుక కచ్చితంగా మంచి పంట కోసం,మంచి ఆరోగ్యం కోసం సూర్య దేవుడిని ప్రార్థించాలి.
అ తరువాత వ్యవసాయం చేయడానికి ఉపయోగించే ముఖ్యమైన ఆవులను,ఎద్దులను కూడా పూజించాలి.ఎందుకంటే వాటికి కలిగే లాభం కన్నా మనకు కలిగే ఆహార లాభాలకె తల్లిలా పనిచేస్తూ ఉంటాయి కనుక. చాలా ప్రాంతాలలో పశువులను కూడా సగటు మనిషి లాగే భావించి,ఇళ్లల్లోనే వాటిని ప్రత్యేకంగా ఒక భాగంలో ఉంచుతారు.
మరియు మన అనుభవించే కర్మఫలాలకు, భోగభాగ్యాలకు అసలు కారణం మన పెద్దలు.వారు సంపాదించిన మరియు వారు చేసిన పుణ్యాలే మనకు మంచి చేసేలా చేస్తాయి.కనుక వారిని తలుచుకుని కచ్చితంగా తర్పణాలు ఇవ్వాలి.ఈ సమయంలోనే వారు దేవతలుగా వచ్చి,మనల్ని ఆశీర్వదిస్తారు.
కావున ప్రతి ఒక్కరు ఈ సంక్రాంతి సమయంలో ఖచ్చితంగా పైన చెప్పిన వారికి పూజల అందించి,వారు ఇచ్చే అనుగ్రహాలను తప్పక పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: