బోగిపళ్ళు పోయడానికి వెనుక అంతరార్థం తెలుసా..?

Divya
తెలుగు వాళ్లకు పెద్ద పండుగలో సంక్రాంతి ఒక పెద్ద పండగ చెప్పవచ్చు.మన హిందూ సంప్రదాయంలో ఏ పండుగను మూడు రోజులపాటు జరుపుకోరు కానీ, సంక్రాంతి మాత్రం మూడు రోజులపాటు ఆనందంగా కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా జరుపుకునే పండుగ ఇది.ఈ సమయంలో మొదటి రోజు భోగి,రెండో రోజు సంక్రాంతి,మూడో రోజు కనుమ.ఈ సమయంలోనే సూర్యుడు దక్షిణాయన కాలం నుంచి ఉత్తరాయన కాలంలోకి అడుగుపెడుతారు.ఇలా అడుగు పెట్టడాన్నే మకర సంక్రమణము అంటారు.
ఈ సమయంలోనే దేవతలు మేలుకొని ఉంటారని,వారి ఆశీస్సులు మనకు దక్కలంటే పిల్లలకు భోగి పళ్ళు పోయాలని పెద్దలు చెబుతుంటారు.బోగి రోజున ఉదయం లేవగానే మన ఇంట్లో ఉన్న విరిగిపోయిన కుర్చీలు,పాత విసన కర్రలు,పాడయిన బల్లలు వంటి పాత వస్తువులన్నీ వేసిభోగి మంటలు వేస్తాము.ఈ భోగి మంటలు వెనుక కారణము మన ఇంట్లో నుంచి చెడు వెళ్లిపోయి,నూతన ఉత్సాహం రావాలని ఈ భోగి మంటలు వేస్తాము.
మరియు అదే రోజున బొమ్మలు కొలువు పెట్టడం, పిల్లలకు భోగిపల్లు వేయడం వంటివి చేస్తూ ఉంటాము. భోగి పళ్ళు వేయడానికి ముఖ్య కారణం పిల్లలపై ఉన్న దృష్టి దోషాలు పోగొట్టడమే కాకుండా,జన్మతహ దోషాలు పోగొట్టడానికి కూడా ఇవి పని చేస్తాయి.భోగిపల్లు వేయడానికి ఐదు రకాల వస్తువులను కలిపి వేస్తూ ఉంటారు.అందులో ముఖ్యంగా రేగి పళ్ళు,పూలు,చిల్లర డబ్బులు,చెరుకు గడలు,నానబెట్టిన శనగలన్నీ కలిపి దేవుడు ముందు ఉంచుతారు.ఆ తరువాత ఇంట్లో ఉన్న పెద్దలు మరియు ముత్తైదువులు పిల్లలకి ఈ భోగి పళ్ళతో దిష్టి తీసినట్టు తీసి,వారి తలపై వేస్తారు.
ఇందులో వాడిన రేగి పండ్లను బదరీఫలం అని అంటారు.పురాణాల ప్రకారం శివుణ్ని ప్రసన్నం చేసుకోవడానికి నరులు,దేవతలు కలసి బదరికావనంలో ఘోర తపస్సు చేశారట.ఆ సమయంలో శివుడు వారి పూజలకు మెచ్చి,వారి తలల మీద బదరీ ఫలాలని వర్షంల కురిపించ్చారంట.ఆ సందర్భనికి గుర్తుగా, పిల్లలను నారాయణుడిగా భావించి భోగిపండ్లను పోయడం వల్ల,శివుడి ఆశీస్సులు కలుగుతాయని వేద పండితులు చెబుతున్నారు.కావున మీరు కూడా ఈ బోగి పండుగ రోజున  పిల్లలకు బోగిపళ్లను పోయడం అస్సలు మరవకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: