డిసెంబరు లో కోవిడ మరణాల సంఖ్య.. విస్తుపోయే నిజాలు చెప్పిన WHO సంస్థ..!!

Divya
కోవిడ్-19 దాదాపుగా ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది తమ కుటుంబ సభ్యులను ఈ వైరస్ బారిన పడడం వల్ల కోల్పోవడం జరిగింది.. అలాంటి దుర్ఘటన సంఘటనలు మళ్ళీ రాకూడదని ప్రజలు కూడా కోరుకుంటున్నారు. అయితే ఇప్పుడు మరొకసారి ఆరోగ్య సంస్థ ఈ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతోందని హెచ్చరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పాక్షికంగా ఈ వైరస్ విజృంభిస్తోందని దీనివల్ల రాబోయే రోజుల్లో మరొక సారి పెద్ద ముప్పుగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థలలో ఒకరైన చీఫ్ టెట్రోన్ ఆదునామ్ తెలిపారు.

కేవలం ఒక్క డిసెంబర్ నెలలోనే ఈ కోవిడ్-19 వల్ల పదివేల మంది మరణించినట్లుగా WHO సంస్థ వెల్లడించింది.. క్రిస్మస్ నెలలోనే కోవిడ్ JN -1 ఎక్కువగా వ్యాప్తి చెందిందని తెలియజేశారు. ఈ కరోనా వైరస్ ఇంకా ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెందుతూనే ఉందంటూ అధికారులు తెలుపుతున్నారు.. అయితే ఈ వైరస్ వల్ల చేరే వారి సంఖ్య 42 నుంచి 60 శాతానికి పెరిగిందని ఆరోగ్య సంస్థలు తెలియజేస్తున్నాయి. కోవిడ్ వైరస్ అమెరికా ,యూరప్ దేశాలలో చాలా ఎక్కువగా ఉందంటూ తెలిపారు. దీంతో మరొకసారి ప్రజలు దేశవ్యాప్తంగా పలు రకాల జాగ్రత్తలతో పాటు వైరస్ పట్ల అందరూ అవగాహనతో ఉండాలని WHO సంస్థ సూచిస్తోంది.

కోవిడ్ పరీక్షలు, చికిత్స ,వ్యాక్సిన్ ముఖ్యమని తెలియజేశారు.. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో కోవిడ్ టీకాలు వేయించుకోవాలని ముందు జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ టెట్రోన్ ఆదునామ్ సూచించారు. 2019వ సంవత్సరం చివరిలో చైనాలో ఈ కోవిడ్ వైరస్ మొదలయిందని తెలిపారు. అనంతరం మూడు సంవత్సరాలు గడిచిన తర్వాత 2023 మే నెలలో అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి కోవిడ్ 19 ముగిసినట్లుగా ప్రకటించారు. అయినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగానే ఉండాలని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: