భారీ కింగ్ కోబ్రాని.. ఎంత ఈజీగా పట్టేసాడో చూడండి?

praveen
పాము.. ఈ పేరు వినిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతూ ఉంటుంది. కళ్ళ ముందు కనిపించేది విషపూరితమైన పాము కాదు అని తెలిసినప్పటికీ కూడా ఎందుకో పాము అంటే ఇక మనుషులందరూ కూడా తెగ భయపడిపోతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది మాత్రం సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించడం కోసం ఏకంగా విషపూరితమైన పాములతో ఆటలు ఆడుతూ చివరికి ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి.

 అయితే ఈ భూమి మీద విషపూరితమైన పాములు చాలానే ఉన్నాయి. ఇలాంటి వాటిలో యమ డేంజరస్ పాము ఏది అంటే కింగ్ కోబ్రా అని చెప్పాలి. ఈ పాము విషం మాత్రమే కాదు దీని ఆకారం కూడా వెన్నులో వణుకు పుట్టించే విధంగానే ఉంటుంది అని చెప్పాలి. ఒక కాటుతో దాదాపు 20 మంది వ్యక్తులను చంపగల శక్తిని కలిగి ఉంటుంది కింగ్ కోబ్రా. కింగ్ కోబ్రా ఒక్కసారి దాడి చేసింది అంటే చాలు మనిషైనా జంతువు అయినా కేవలం నిమిషాల్లోనే ప్రాణాలు కోల్పోతూ ఉంటాడు. అయితే ఇలాంటి కింగ్ కోబ్రాలను పట్టుకోవడం స్నేక్ క్యాచర్లకు కూడా ఏకంగా సవాలు లాంటిదే అని చెప్పాలి.

 అయితే ఇప్పటివరకు కింగ్ కోబ్రాలకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతుంది అని చెప్పాలి. ఏకంగా పది అడుగుల పొడవు ఉన్న కింగ్ కోబ్రాని స్థానికులు చూసి ఒకసారిగా హడలిపోయారు. వెంటనే స్నేక్ క్యాచర్ ను సమాచారం అందించగా.. ఇక స్నేక్ క్యాచర్ వచ్చి ఆ పామును ఎంతో చాకచక్యంగా పట్టేసాడు. దీంతో అక్కడున్న వారందరూ కూడా షాక్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: