ఏందయ్యా సామీ ఇది.. గిన్నిస్ రికార్డు కోసం ఇంత రిస్క్ చేయాలా?
ఈ క్రమంలోనే ఇక వరల్డ్ రికార్డులు సాధించడానికి ఆయా వ్యక్తులు ఏం చేయడానికైనా సిద్ధపడుతూ ఉంటారు. ఏకంగా తమ ప్రాణాలను ప్రమాదంలో పెట్టుకొని మరి ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కాలని ఎన్నోసార్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటివి చూసినప్పుడు నిజంగా పిచ్చి పీక్స్ కి వెళ్ళిందేమో అనే భావన ప్రతి ఒక్కరు కూడా కలుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తికి ఇలాగే వరల్డ్ రికార్డు సాధించాలని భావించి ఏకంగా ప్రాణాలను రిస్క్ చేసి మరి ఒక విన్యాసం చేశాడు. ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.
ఏకంగా ఈ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంది అని చెప్పాలి. ఒక వ్యక్తి ఏకంగా తన పొట్టపై భారీ పుచ్చకాయలను ఉంచి వాటిని తన కుడి చేతిలో ఉన్న కత్తితో కట్ చేస్తున్నాడు. 2018లో ఈ అరుదైన ఫీట్ ను ప్రదర్శించిన సదరు వ్యక్తి ఇటీవలే గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించాడు. అయితే ఈ విన్యాసం చేస్తున్నప్పుడు ఏమాత్రం తేడా జరిగిన కత్తి కడుపులోకి చొచ్చుకుపోయే అవకాశం ఉంటుంది. అయినప్పటికీ అతను ప్రాణాలను ఫణంగా పెట్టి ఇక రికార్డు కోసం ఈ విన్యాసం చేశాడు. ఇక ఈ వీడియోను గిన్నిస్ బుక్ నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు అని చెప్పాలి. ఇక ఇలా వైరల్ గా మారిపోయిన వీడియో చూసి నేటిజన్స్ అందరు కూడా షాక్ అవుతున్నారు.