వైరల్ : నడిరోడ్డుపై ఎదురుపడిన పాము, ముంగిస.. చివరికి ఏం జరిగిందంటే?

praveen
సాధారణంగా  ఈ భూమ్మీద ఉండే అన్ని జీవులు కూడా స్నేహభావంతోనే మెలుగుతూ ఉంటాయి అని చెప్పాలి. కానీ కొన్ని జీవుల మధ్య మాత్రం పుట్టుకతోనే జాతి వైరం కొనసాగుతూ ఉంటుంది. అలాంటి జీవులలో పాము, ముంగిస.. పిల్లి, ఎలుక.. కుక్క  పిల్లి లాంటి జంతువులు ఉంటాయి అని చెప్పాలి. ఈ రెండిటి మధ్య ఎందుకు వైరము ఉంటుందో తెలియదు. కానీ ఈ రెండు జంతువులు ఎదురుపడ్డాయి అంటే చాలు వాటి మధ్య భీకర పోరు జరుగుతూ ఉంటుంది. అయితే ఇటీవల కాలంలో అటు పెంపుడు జంతువులుగా మారిపోయిన కుక్క పిల్లి మధ్య మంచి స్నేహబంధం ఉండడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతూ ఉన్నాయి.

 అయితే పిల్లి, కుక్క కలిసి ఉండడం చూశాం. కానీ ఇక పుట్టుకతోనే వైరం ఉండే పాము ముంగిస ఎప్పుడు కలిసి ఉండడం చూడలేదు. ఈ రెండు జీవులు ఎప్పుడు ఎదురుపడిన బీకర పోరు జరుగుతూ ఉంటుంది. ఏకంగా ప్రాణాలు పోయేంతవరకు కూడా రెండు పోట్లాడుకుంటూ ఉంటాయి అని చెప్పాలి. అయితే పాము ముంగిస మధ్య జరిగే యుద్ధానికి సంబంధించిన వీడియోలు చాలానే ఇప్పటివరకు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అని చెప్పాలి.

 ఏకంగా నడిరోడ్డుపైనే నాగుపాము ముంగిస మధ్య పోరు జరిగింది. రోడ్డుపైకి వచ్చిన తాచుపాము పై ముంగిస దాడి చేయడానికి ప్రయత్నించింది. దీంతో ఒక్కసారిగా నాగుపాము అప్రమత్తమమైంది. పడగ విప్పి బుసలు కొట్టడం మొదలుపెట్టింది. ఈ క్రమంలోనే దాడి చేయడానికి వచ్చిన ముంగిస పై ప్రతి దాడికి దిగింది. దాదాపు అరగంట పాటు ప్రధాన రహదారిపై త్రాచుపాము బుసలు  కొడుతూ ముంగిసతో పోరాటానికి ప్రయత్నించగా.. ముంగిస ఒక్కసారిగా భయపడి అక్కడ నుంచి పారిపోయింది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం చోడవరం గ్రామంలోని రహదారిపై చోటుచేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: