అయ్య బాబోయ్.. కంపెనీలో బాయిలర్ ఎలా పేలిందో చూడండి?
మహారాష్ట్రలో కూడా ఇలా ఓ కెమికల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. నాసిక్ లో ఉన్న ఒక కెమికల్ ప్లాంట్లో బాయిలర్ పేలడం కారణంగా ఈ భారీ పేలుడు సంభవించింది అనేది తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మండే గావ్ గ్రామంలోని జిందాల్ గ్రూప్ పాలిథిన్ తయారీ యూనిట్లో ఇక మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడు సంభవించినట్లు తెలుస్తుంది.
ఇక ఈ పేలుడు సంభవించిన సమయంలో ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. అయితే అప్పటికే మంటలు వ్యాపించిన నేపథ్యంలో మంటల్లో చిక్కుకొని ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడట. ఇక మరో 19 మందికి కూడా గాయాలు అయినట్లు తెలుస్తుంది. అయితే ఇలా గాయపడిన వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇక ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. కెమికల్ ప్లాంట్ బాయిలర్లు ఒక్కసారిగా పేలుడు సంభవించి మంటలు చెలరేగడంతో ఇక పెద్ద ఎత్తున చుట్టుపక్కల ప్రాంతాల్లో పొగ వ్యాపించింది అని చెప్పాలి. అంతేకాదు ఇక ఫ్యాక్టరీలో కొంతమంది ఉద్యోగులు చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు చేపట్టారు అధికారులు. ఇక ఈ పేలుడు వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.