తల్లి ప్రేమ.. పుట్టిన బిడ్డని చూసి చింపాంజీ ఎమోషనల్?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా తల్లి ప్రేమ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెబుతూ ఉంటారు ఎంతోమంది . ఇక తల్లి ప్రేమను మించింది ఈ లోకంలో ఏదీ లేదు అని అంటూ ఉంటారు. కొడుకు ప్రయోజకుడు అయిన చెడ్డవాడు అయినా తల్లి మాత్రం ఒకే విధంగా ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అంతేకాదు ఇక కొడుకు ఎంత ఎదిగినా కూడా తల్లికి మాత్రం తన ఒడిలో హాయిగా నిద్రపోయిన చిన్నపిల్డి లాగే కనిపిస్తాడు అని ఎన్నోసార్లు తల్లి ప్రేమ నిరూపించింది అని చెప్పాలి. అంతేకాదు ఇక పిల్లలకు కష్టం వస్తే తల్లి అభల కాదు సభలుగా మారిపోతుంది అన్నదానికి నిదర్శనంగా ఎన్నో ఘటనలు వెలుగు చూసాయ్.

 అయితే కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువుల్లో కూడా తల్లి ప్రేమకు ఏది సాటిరాదు అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయి నేటిజన్ల మనసును హత్తుకున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. తల్లి ప్రేమకు మనుషులే కాదు జంతువులు కూడా అతీతం కాదు అన్నదానికి నిదర్శనంగా నిలిచింది ఈ వీడియో. సాధారణంగానే చింపాంజీలు మనుషుల లాగానే కాస్త ఎక్కువ తెలివి కలిగి ఉంటాయి. ఈ క్రమంలోనే మనుషులు మాదిరిగానే హవాభావాలను వ్యక్తపరుస్తూ ఉంటాయి.
 వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఒక తల్లి చింపాంజీ తన బేబీ చింపాంజీని కలుసుకున్న సమయంలో ఏకంగా చూపించిన ప్రేమ హృదయాన్ని మెలిపెట్టేస్తుంది అని చెప్పాలి. సి సెక్షన్ ద్వారా చింపాంజీకి బిడ్డ జన్మించింది. అయితే ప్రసవం తర్వాత చింపాంజీని వైద్యులు రెండు రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉంచారు. దీంతో తన బిడ్డను కనీసం ఒక్కసారైనా చూడలేకపోయాను అనే బాధ ఆ చింపాంజీలో అలాగే ఉండిపోయింది. రెండు రోజుల తర్వాత తన బిడ్డను కళ్ళ ముందుకు తెచ్చి ఇవ్వడంతో వెంటనే కౌగిలించుకుంది. ఇక ఎంతగానో మురిసిపోయింది చింపాంజీ.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: