వైరల్ :: వెన్నులో వణుకు పుట్టించే యాక్సిడెంట్.. చూస్తే అవాక్కే?
కానీ ఇటీవల కాలంలో మాత్రం ఎంతో మంది వాహనదారులు నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రెస్ గా డ్రైవింగ్ చేస్తున్నారు అని చెప్పాలి. తద్వారా ఇక ప్రాణాలను చేజేతులాల తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో ఒళ్ళు గగుర్పాటుకు గురి చేసే రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో ప్రత్యక్షం అవుతున్నాయి అని చెప్పాలి. ఇక ఇలాంటి వీడియోలు చూసినప్పుడు ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది.
ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే అత్యంత వేగంగా కారులో దూసుకు వచ్చిన ఒక వ్యక్తి టోల్ గేట్ ను బలంగా ఢీకొట్టాడు. సరిగ్గా టోల్ బూత్ ముందు ఉన్న డివైడర్ను ఎంతో బలంగా ఢీకొట్టడంతో ఈ యాక్సిడెంట్ దాటికి కారు పైకి ఎగిరి కింద పడిపోయి నుజ్జు నుజ్జుగా మారింది. అంతే కాదు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి కారు లోపల నుంచి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఇక వెంటనే కారులో మంటలు చెలరేగాయ్. ఇక కారు డ్రైవర్ బ్రతికి ఉన్నాడా లేదా చనిపోయాడా అన్నది మాత్రం తెలియ రాలేదు. ఇక ఈ వీడియో చూసి నేటిజన్స్ షాక్ అవుతున్నారు.