వైరల్ : వాహనాల తనిఖీ.. పోలీసులు చేసిన పనికి యువకులకు గాయాలు?

praveen
ఇటీవల కాలంలో పోలీసులు కాస్త అప్రమత్తంగానే ఉంటూ ఎక్కడకక్కడ వాహనాల తనిఖీలు చేపడుతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అయితే ఇలా వాహనాలు తనిఖీలు చేపడుతున్న సమయంలో కొంతమంది వాహదారుడు నిర్లక్ష్యంగా వ్యవహరించే తీరు పోలీసులకు గాయాల పాలు అయ్యేలా చేస్తుంది. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు పోలీసులు అత్యుత్సాహం కూడా వాహనదారులను గాయాలపాలు చేస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవల బీహార్ లో ఇలాంటి తరహా కఠిన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. ఒక పోలీస్ చూపించిన అత్యుత్సాహం కారణంగా ఇద్దరు వాహనదారులు బైక్ పైనుంచి కింద పడిపోయి గాయాల పాలయ్యారు.

 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది అని చెప్పాలి. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది నేటిజన్స్  పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ వీడియోలో చూసుకుంటే స్కూటీపై వెళ్తున్న ఇద్దరు యువకులు కూడా పోలీసులు ఆపమని చెప్పినప్పటికీ తమ బండి ఆపకుండా ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోయిన ఒక కానిస్టేబుల్ వారి వాహనాన్ని వెంబడిస్తూ తన చేతిలో ఉన్న లాటితో వెనకాల నుంచి కొట్టాడు. అయినప్పటికీ ఆ యువకులు బండి ఆపకుండా వెళుతున్న సమయంలో ఇక ముందు నిలబడిన మరో కానిస్టేబుల్ వారిని తోసేశాడు.

 ఈ క్రమంలోనే వాహనంపై వేగంగా వెళుతున్న ఇద్దరు యువకులు కూడా ఒక్కసారిగా రోడ్డుపై కింద పడిపోయారు. ఈ ఘటనలో కానిస్టేబుల్ కు ఎలాంటి గాయాలు కాలేదు.  అయితే వాహనం దారులకు మాత్రం గాయాలు అయినప్పటికీ వినిపించుకోని పోలీస్ కానిస్టేబుల్ మరోసారి లాఠీతో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. దీంతో వారు చేతులెత్తి తమను రక్షించమని వేడుకున్నారు. అయితే ఇదంతా అక్కడున్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ వీడియో చూసిన నెటిజన్లు పోలీసులు ప్రవర్తించిన తీరుపై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: