వైరల్ : ఎర్రతల పాము.. దానికంటే పెద్దపామును అమాంతం మింగేసింది?
అయితే సాధారణంగా పాముకు ఆకలి వేసిన సమయంలో చుట్టుపక్కల ఉండే ఎలుకలను లేకపోతే చిన్న చిన్న కీటకాలను చంపి తింటుంది అన్న విషయం అందరికీ తెలుసు. కొన్నిసార్లు ఏకంగా పక్షులు పెట్టిన గుడ్లను కూడా ఆరగిస్తూ కడుపు నింపుకుంటూ ఉంటాయి పాములు. అయితే కొన్ని పాములు వీటితో మాత్రమే కడుపు నింపుకుంటే ఇంకొన్ని పాములు మాత్రం ఏకంగా మరో పామును ఆరగించి కడుపు నింపుకోవడం లాంటివి చేస్తూ ఉంటాయి. పాముకు బాగా ఆకలి వేస్తే ఏమీ దొరకని సమయంలో తన పిల్లలని చంపితింటుంది అన్నది కూడా ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితం అయింది.
ఇక ఒక పాము మరో పామును తినడం లాంటి వీడియోలు కూడా ఇప్పుడు వరకు సోషల్ మీడియాలో చాలానే వెలుగులోకి వచ్చాయి అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి చక్కర్లు కొడుతుంది. ఒక పామును మరో పాము అమాంతం మింగేసింది. దీనికి సంబంధించిన వీడియోను వైల్డ్ యానిమల్ పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. ఈ వీడియోలో చూసుకుంటే ఎర్ర తల ఉన్న పాము దాని కంటే పెద్ద ఆకారం ఉన్న మరోపామును కేవలం క్షణాల వ్యవధిలో లటుక్కున్న మింగేసింది అని చెప్పాలి. ఈ వీడియో చూసి నేటిజల్లు ఆశ్చర్యపోతున్నారు.