వైరల్ : కుక్కతో రెజ్లింగ్ పోటీ.. చివరికి ఏం జరిగిందంటే?
కండలు తిరిగిన వీరుడికి కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్ జరగడం ఏంటి వినడానికి కాస్త విచిత్రంగా ఉందే అని అనుకుంటున్నారు కదా. కానీ ఇది నిజంగానే జరిగింది. సాధారణంగా కుక్క మ్యాచ్ ఆడింది అంటే కేవలం కండలు పీక్కు తినడం ఒకటే జరుగుతుంది అని అందరూ అనుకుంటారు. కానీ ఇక్కడ కుక్క కరవకుండా ప్రత్యర్థిని మట్టి కనిపించింది. అయితే ఇది నిజమైన రెజ్లింగ్ లాగా జరగలేదు. కేవలం సరదా కోసం మాత్రమే జరిగింది.. బార్డర్ అనే కుక్క బర్త్డే సందర్భంగా దాని యజమాని ఇలా రెజ్లింగ్ ప్లాన్ చేశాడు. వెస్ట్రన్ ఫెయిర్ లోని రెజ్లింగ్ రింగ్లో అడుగుపెట్టిన వెంటనే మ్యాచ్ అంతా కలియతిరిగిన బార్డర్ అనే కుక్క ప్రేక్షకులకు అభివాదం చేసింది.
ఇక ఆ తర్వాత తన యజమాని ప్రత్యర్థి అయిన సైకో మైక్ తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ట్రైనర్ ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ సదరు కుక్క మ్యాచ్ ఆడింది అని చెప్పాలి.. ముందుగా అనుకున్న ప్రకారం కుక్క సైకో మైక్ మీదకు రాగానే అతను కింద పడిపోయాడు. ఆ తర్వాత సదరు రెజ్లర్ను పైకి లేవకుండానే మూడుసార్లు జంప్ చేసింది కుక్క. ఇక ఆ తర్వాత మూడు సార్లు అంపైర్ కౌంట్ చేయడం చేసి చివరికి బార్డర్ అనే కుక్కను విజేతగా ప్రకటించారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇది చూసిన ఎంతోమంది నెటిజన్లో కుక్కతో రెజ్లింగ్ అంటే కాస్త వింతగా ఉన్న ఇదేదో కొత్తగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.