వైరల్ : యజమాని చెప్పగానే.. బాంగ్రా డాన్స్ చేసిన గేదె?
ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ప్రస్తుతం దేవీ నవరాత్రుల నేపథ్యంలో ఎక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కరూ ఎంతో ఘనంగా సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నారు ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు బంధువులతో కలిసి ఇక అమ్మవారిని ప్రతిష్టించడమే కాదు తొమ్మిది రోజులపాటు ఇక డాన్సులు చేస్తూ ఉత్సవాలు జరుపుకుంటున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే బంగ్లా డాన్స్ చేయడం లాంటి వీడియోలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. ఇప్పటివరకు మనుషులు మాత్రమే డాన్స్ చేయడం గురించి అందరం చూసాము.
ఇక కొన్ని కొన్ని సార్లు పెంపుడు జంతువులు అయినా కుక్క, పిల్లి కూడా డాన్స్ చేయడం లాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా ఒక గేదె నృత్యం చేస్తూ ఉంది. ఇది నమశక్యంగా లేకపోయినప్పటికీ ఇక్కడ వీడియో చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు నమ్మకుండా ఉండలేరు అని చెప్పాలి వైరల్ అవుతున్న క్లిప్ లో గేద యాజమానిగ కనిపించే మహిళ ఇంటి పెరట్లో నిలబడి ఉన్న గేదె దగ్గరికి వెళ్ళింది ఇక గేదలకు ఆహారం ఇస్తూ బాంగ్రా స్టెప్పులు వేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే గేదెను కూడా చేయమని చెప్పింది ఆ మహిళ. చెప్పిన వెంటనే గేదె కూడా స్టెప్స్ వేసేందుకు ప్రయత్నించింది. ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.