వైరల్ : అర్ధరాత్రి పక్షి ప్రాణం కాపాడడం కోసం.. ఎంత రిస్క్ చేశారు?
ఇక్కడ వెలుగు లోకి వచ్చిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ఇంకా సభ్య సమాజం లో మానవత్వం బ్రతికే ఉంది అని ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఇటీవలి కాలం లో ప్రజల నిర్లక్ష్యం వల్ల అధికారుల అలసత్వం కారణం గా వందలాది మూగజీవాలు పతంగి మాంజా లకు బలి అవుతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇటీవలే హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ లో గాంధీ విగ్రహం దగ్గర ఒక కాకి చైనా మాంజా లో ఇరుక్కు పోయింది. గమనించిన స్థానికులు వెంటనే సహాయక సిబ్బందికి సమాచారం అందించారు.
కాకి ప్రాణమే కదా పోతే పోనీ అని అనుకోలేదు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే చైనా మాంజా లో ఇరుక్కున్న కాకి నీ కాపాడేందుకు మూడు గంటల పాటు ఆపరేషన్ చేసి చివరికి కాకిని ప్రాణాలతో సురక్షితంగా బయటకు తీశారు. ఇక ఇందుకు స్థానికులు కూడా సహాయం చేయడం గమనార్హం. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఎంతో మంది జనాలు చైనా మాంజాలు వాడటం కారణంగా ప్రజలు పక్షుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని.. చైనా మాంజలు వాడటం మానుకోవాలి అంటూ సూచిస్తున్నారు అధికారులు.