వెడ్డింగ్ కార్డు కాదు.. ఇందులోనే కోట్లు ఉన్నాయి?
తద్వారా నేటి రోజుల్లో డ్రగ్స్ అక్రమ రవాణా ఎలా చేపడుతున్నారు అన్న దానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయ్. ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తున్నాయి. ముఖ్యంగా రోజుకో పద్ధతిలో మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు కేటుగాళ్లు. ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిస్తే మాత్రం ప్రతి ఒక్కరూ అవాక్కవుతారు అనే చెప్పాలి.. ఇక ఏది దొరకలేదు అన్నట్టు వెడ్డింగ్ కార్డులో డ్రగ్స్ పెట్టి చివరికి అక్రమ రవాణా చేయడం మొదలు పెట్టారు. దీంతో పోలీసులకు దొరికారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.
సాధారణంగా వెడ్డింగ్ కార్డులో డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే ఎవరు గుర్తు పట్టరు అని భావించి ఇక ఈ ప్రయత్నాలు చేశారు. కానీ చివరికి ప్లాన్ కాస్త బెడిసి కొట్టింది అని చెప్పాలి. ఈ ఘటన బెంగుళూరు లో జరిగింది. ఒక అమ్మాయి 43 వెడ్డింగ్ కార్డులతో పోలీసులకు పట్టుబడింది. ఇక ఏంటి అని చెక్ చేస్తే 43 వెడ్డింగ్ కార్డులలో 120 గ్రాముల కొకైన్ బయటపడింది. దీంతో అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ట్విట్టర్ లో ఈ వీడియో వైరల్ గా మారిపోయింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు సదరు అమ్మాయి మామూలు ఆడపిల్ల కాదని ఖిలేడి అంటూ కామెంట్లు చేస్తూనే ఉన్నారు.