వైరల్ : మనుషులను చూసి భయపడిన ఎలుగుబంటి.. ఏం చేసిందంటే?

praveen
అడవుల్లో ఉండే క్రూర జంతువు లలో  ఎలుగుబంటి కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమం  లోనే ఇటీవల కాలం లో అడవుల్లో ఉండే ఎలుగుబంట్లు జనావాసాల్లోకి కూడా వస్తూ ఎంతో మంది పై దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇలాంటి తరహా ఘటనలు చూసినప్పుడు అడవికి దగ్గరగా వున్న గ్రామాల వారు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతూ ఉన్నారు అని చెప్పాలి. సాధారణంగా ఒంటరిగా జీవించే ఎలుగుబంట్లు ఎక్కువగా రాత్రి సమయంలో చురుకుగా కనిపిస్తాయి.

 భారీ ఆకారం ఉన్నప్పటికీ కూడా ఎంతో వేగంగా కలుగుతాయి. అంతే కాదు ఎంతో సులభంగా చెట్లు కూడ ఎక్కగలవు . నీళ్ళల్లో కూడా ఈదుకుంటూ వేగంగా వెళ్లగలవు. అయితే సాధారణంగా ఎలుగుబంటికి  చెట్టు ఎక్కడం వచ్చు కానీ దిగటం రాదు అని పెద్దలు అప్పట్లో చెప్పేవారు. ఇక ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం ఇది నిజమేనేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇటీవలే ఒడిషాలో తెల్లవారుజామున ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోరాపుట్ జిల్లాల్లోని బొరిగుమ్మ పట్టణంలో  30 అడుగుల ఎత్తులో చెట్టుపై ఎలుగుబంటి ఇరుక్కుపోయింది.

 ఈ క్రమంలోనే ఆ నోటా ఈ నోటా పడి ఇక స్థానికంగా ఉన్న అందరికీ కూడా ఈ విషయం పాకిపోయింది. దీంతో చెట్టుమీద ఇరుక్కుపోయిన ఎలుగుబంటి ని చూసేందుకు వేలాదిమంది స్థానికులు అక్కడ గుమి కూడారు. అయితే జనం గుమికూడి ఉండడం చూసిన ఎలుగుబంటి చెట్టుపైన మరింత పైకి ఎక్కి నాలుగు కొమ్మలను పట్టుకుంది. కాగా అటవీ శాఖ అధికారులు అక్కడికి వచ్చి ఎలుగుబంటిని కిందకు దిగేందుకు ఎంత ప్రయత్నించినా.. అది మాత్రం దిగలేదు.  అతి కష్టం మీద ఎలుగుబంటి ని పట్టుకున్న అటవీశాఖ అధికారులు చివరికి వాటి సహజ ఆవాసాలకు తిరిగి పంపించే ప్రయత్నం చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: