వైరల్ : రిబ్బన్ కట్ చేయగానే.. కూలిపోయిన వంతెన?
ఇలా వంతెన ప్రారంభం సమయం లో ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. కొన్ని కొన్ని సార్లు వంతెన నిర్మించిన సమయంలో కొన్ని రోజులకే ఆ వంతెన కూలి పోవడం లేదా డ్యామేజ్ కావడం లాంటివి జరుగుతూ ఉంటుంది. కానీ ఇక్కడ జరిగిన ఘటన మాత్రం చాలా విచిత్రమైనది అని చెప్పాలి. ఎందుకంటే ఆ వంతెన రిబ్బన్ కట్ చేశారో లేదో క్షణాల వ్యవధిలో కూలిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో ప్రారంభోత్సవానికి సిద్ధమైన ఓ బ్రిడ్జ్ రిబ్బన్ కట్ చేస్తుండగానే కుప్పకూలిపోయింది.
వర్షాకాలం కావడంతో ఇక నది దాటేందుకు ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమస్యను తీర్చేందుకు ఒక చిన్న బ్రిడ్జి నిర్మించారు. ఇక ఈ బ్రిడ్జిని ప్రారంభించేందుకు ఒక మహిళా ప్రభుత్వాధికారి చీఫ్ గెస్ట్ గా ఇక్కడికి వచ్చారు. అయితే ఇలా మహిళా అధికారి వంతెన ప్రారంభించడానికి రిబ్బన్ కట్ చేయగానే బ్రిడ్జి ఒక్కసారిగా కూలిపోయింది. ఈ క్రమంలోనే అలర్ట్ అయిన అధికారులు ముందుగా ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటకు లాగేసారు. బ్రిడ్జి ప్రారంభోత్సవం రోజే కూలిపోవడంతో అధికారుల నిర్లక్ష్యంపై ప్రజలకు దుమ్మేస్తూ పోస్తున్నారు అని చెప్పాలి.