కూతురిపై ఆకాశమంత ప్రేమ.. ప్రతి తండ్రిని కదిలిస్తున్న వీడియో?

praveen
ఈ భూమి మీద ఎన్ని రకాల బంధాలు ఉన్నప్పటికీ అటు తండ్రి కూతుర్ల బంధం మాత్రం ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పాలి. ఈ బంధం గురించి ఎంత గొప్ప మాటలు చెప్పినా కూడా బంధంలో ఉన్న ప్రేమ ముందు అవి చిన్నగానే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇంట్లో ఎంత మంది కొడుకులు ఉన్న ప్రతి తండ్రి అమితంగా ఇష్టపడేది అల్లారుముద్దుగా చూసుకునేది మాత్రం ఏకంగా గారాలపట్టి అయిన కూతురుని చెప్పాలి. చిన్నప్పుడు  మాత్రమే కాదు పెద్దయిన తర్వాత కూడా తన కూతురు ఇంకా చిన్నపిల్ల అంటూ వెనక్కి వేసుకు వచ్చేది కూడా తండ్రి అని చెప్పాలి.


 ఇంట్లో అందరి ముందు ఎంతో గంభీరంగా ఉంటూ అందరినీ భయపడేలా చేసే తండ్రి.. తన కూతురికి మాత్రం ఎంతగానో భయపడిపోతూ ఉంటాడు. తన ఇంటి లక్ష్మీదేవి అని చెబుతూ ఉంటాడు తండ్రి. ఇలా ఎప్పుడు ఎక్కడైనా సరే తండ్రి కూతుర్ల మధ్య ఉన్న బంధాన్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరి మనసు పులకరించి పోతూ ఉంటుంది. అయితే ఇలా చిన్నప్పుడు నుంచి ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు చివరికి పెళ్లి సమయంలో తండ్రి నుండి విడి పోతూ ఉంటే ఇక ప్రతీ తండ్రికి ఆ బాధ వర్ణనాతీతం అని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో ఇప్పటివరకు తండ్రి కూతుర్ల బంధాన్ని చాటే వీడియోలు ఎన్నో వైరల్ గా మారిపోయాయ్.


 ఇక ఇప్పుడు ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఈ వీడియో ప్రతి ఒక్కరి మనసును తాకుతుంది అనే చెప్పాలి. అంతే కాదు ప్రతి తండ్రికి కూడా తన గారాలపట్టి గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇంతకీ ఈ వీడియో లో ఏముందంటే కూతురికి పెళ్లి చేసి వీడ్కోలు చెప్పడానికి  తల్లిదండ్రులు తమ కుమార్తె పాదముద్రలు భద్రపరచడానికి ఈ వీడియోలో చూడవచ్చు. తన కూతురిని  కూర్చో పెట్టి తల్లిదండ్రుల నేల మీద  కూర్చుని ఒక తెల్ల బట్టలో పాదముద్రలు తీయడానికి ముందు తండ్రి ఎంతో ప్రేమగా కూతురు పాదాలను నీళ్ళతో కడిగాడు. అనంతరం పాదముద్రలు తీసుకున్నారు. ఇక ఈ వీడియో మాత్రం ప్రతి తండ్రి మనసుని కదిలిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: