వైరల్ : రెచ్చిపోయిన మహిళ.. సెక్యూరిటీపై ఎలా దాడి చేసిందో చూడండి?
సెక్యూరిటీ గార్డులు అపార్ట్మెంట్ నుంచి ఎవరైనా వస్తున్నప్పుడు గేటు గేటు వేయడం తీయటం లాంటివి చేస్తూ ఉంటారు. అయితే భవ్య రాయి కారు తో వస్తున్న సమయంలో గేట్ తీయడానికి కాస్త ఆలస్యమైంది అనే కారణంతో కోపంతో ఊగిపోయింది. ఈ క్రమంలోనే తన రెసిడెన్షియల్ సొసైటీ సెక్యూరిటీ గార్డులపై అరుస్తూ చేయి చేసుకోవడం గమనార్హం. ఇట్లుగేట్ తెరిచేందుకు ఎందుకు అంత ఆలస్యం అయింది అంటూ నిలదీస్తూ దారుణంగా బూతులతో విరుచుకుపడింది. సెక్యూరిటీ గార్డులను తిట్టడమే కాదు అసభ్య సంజ్ఞలు చేస్తూ దారుణంగా ప్రవర్తించింది అని చెప్పాలి.
మహిళ ఇలా బూతులు తిడుతూ రచ్చ చేస్తున్న సమయంలో పక్కనే ఉన్న కొంతమంది ఇదంతా వీడియో తీసి ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేయడంతో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. నోయిడాలోని సెక్టార్ 126 లో జేపీ విచ్ టౌన్ సొసైటీ ఉంది. అందులో ఉంది భవ్య రాయ్. కాంప్లెక్స్ నుంచి బయటకు వెళ్లాలని అనుకుంది ఆమె. అప్పటికే సెక్యూరిటీ గార్డ్ దూరంగా ఉండటంతో ఇక గేట్ తీయడానికి కాస్త ఆలస్యమైంది. దీంతో కారు దిగి రెచ్చిపోయింది భవ్య. నోటికొచ్చినట్టు తిట్టి కాలర్ పట్టుకుని దాడి కూడా చేసింది. సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. ఈ క్రమంలోనే వెంటనే సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారం అందించగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమెను పోలీస్ స్టేషన్కు తరలించారు.