వైరల్ : బైక్‌ను ఢీకొట్టిన డిఎస్పీ కారు.. అతన్ని డిక్కీలో వేసుకుని మరి?
ఇటీవలే ఒక ప్రమాదానికి సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది. వివరాల్లోకి వెళితే.. దేవరకొండ డిఎస్పి నాగేశ్వరావు రూల్స్ కు మినహాయింపు అన్నట్లుగానే వ్యవహరించారు అన్నది తెలుస్తుంది. ఇటీవలే ఆయన వాహనం మునుగోడు వెళుతూ ఉంది. అయితే యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం కి చెందిన ధనుంజయ ఇక ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. మునుగోడు మీదుగా చండూర్ వెళ్తున్నారు ధనుంజయ. అయితే బోదంగిపర్తి శివారులో టర్నింగ్ వద్ద ధనుంజయ వాహనాన్ని డిఎస్పీ కార్ దారుణంగా ఢీకొట్టింది.
ఓవర్ స్పీడ్ కారణం గానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. టూవీలర్ ఢీకొట్టడం తో ఒక్కసారిగా ధనుంజయ టు వీలర్ పైనుంచి ఎగిరిపడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇది పొరపాటుగా జరిగిన యాక్సిడెంట్ అనుకోవచ్చు. కానీ ఆ తర్వాత కూడా పోలీసులు ప్రవర్తించిన తీరు కూడా బాగాలేదు. ప్రమాదానికి గురైన వ్యక్తిని అంబులెన్స్‌లో తీసుకెళ్లకుండా పోలీసు వాహనం డిక్కీలో తీసుకెళ్లారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే డిఎస్పీ అక్కడి నుంచి వెళ్లిపోయారు అని తెలుస్తోంది. ప్రస్తుతం ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.