వైరల్ : డ్రమ్స్ వాయిస్తున్న కోళ్లు.. వావ్ అంటున్న నెటిజన్లు?

praveen
ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా ప్రపంచం మొత్తం పాకిపోయింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక ప్రపంచం నలుమూలల్లో ఎక్కడ ఏ సంఘటన జరిగినా కూడా క్షణ కాల వ్యవధిలో అర చేతిలో ఉన్న స్మార్ట్ఫోన్ లో తెలుసుకోగలుగుతున్నారూ ప్రతి ఒక్కరు. ఇలా ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో మనిషి ప్రపంచాన్ని మొత్తం అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో బంధించేస్తున్నాడు  అని చెప్పాలి. అయితే ఇటీవలి కాలంలో సోషల్ మీడియా కారణంగా ఎన్నో వీడియోలు ప్రతిరోజు తెరమీదికి వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా  ప్రకృతి లో జీవించే పక్షులు  జంతువులకు సంబంధించిన ఎన్నో విషయాలు ఎంతో మంది దృష్టిని ఆకర్షిస్తూ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే.

 ఇలా వైరల్ గా మారిన వీడియోలలో కొన్ని నవ్వును తెప్పిస్తె.. మరికొన్ని మనసును కదిలిస్తూ ఉంటాయి. ఇంకొన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి వైరల్ గా మారిపోయింది. కోళ్ల కు సంబంధించిన వీడియో చూసి ప్రస్తుతం మ్యూజిక్ లవర్స్ అందరూ బాగుంది అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు అనే చెప్పాలి. ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఇక్కడ ఒక వ్యక్తి అద్భుతమైన ఐడియా తో వినూత్నమైన  ప్రయత్నం చేశాడు. తాను పెంచుకుంటున్న కోళ్ళతో సంగీతం క్రియేట్ చేయాలి అని భావించాడు.

 అనుకున్నదే తడవుగా ఈ ఐడియా   అమలులో పెట్టేసాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే ఆ కోళ్ల ముందు రెండు డ్రమ్స్ పెట్టాడు. తరువాత వాటిపైన కోళ్లకు ధాన్యం వేశాడు. ఇక ఆ ధాన్యపు గింజలను చూసిన కోళ్లు ఎంతో ఆనందంతో ఊగిపోయాయ్. దీంతో ఇక అవి ఎప్పటిలాగానే డ్రమ్స్ మీద వేసిన ధాన్యపు గింజలను తినడం మొదలు పెట్టాయి కోళ్లు. ఇలా ధాన్యపు గింజలు తింటూ ఉంటే ఒక అందమైన డ్రమ్స్ సౌండ్ బయటకు వచ్చింది   ఇదంతా వీడియో తీసిన సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసిన ఎంతో మంది నెటిజన్లు రకాలుగా స్పందిస్తున్నారు అని చెప్పాలి.Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: