నిజంగా ఈరోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారా?

Satvika
భార్యాభర్తల బంధం అనేది చాలా అన్యొన్యమైనది..ఒకరి సంతోషంలో భాగాన్ని పంచుకున్నట్లే, ఒకరి బాధలో మరొకరు భాగం పంచుకొవాలి. ఇటీవల ఓ వ్యక్తి తన భార్య తనని తోయ్యకుండా ఉందని ఆమె కోసం బండిని తీసుకున్నారు. భిక్షాటన కోసం ఇలా చెయ్యడం పై కొందరు  ప్రశంసలు కురిపించారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది. తన భార్య మంచి నీళ్ల కోసం కష్ట పడుతుందని ఏకంగా ఓ బావిని తవ్వాలని అనుకున్నాడు.. అదే ప్రయత్నం లోఉన్నాడు..


వివరాల్లొకి వెళితే..మంచినీళ్ల కోసం భార్య పడుతున్న కష్టాన్ని అతను చూడలేకపోయాడు.. ఆమె కష్టాన్ని తీర్చేందుకు ఎంతో కష్టమైన పనికి శ్రీకారం చుట్టాడు.. దాదాపు మూడేళ్లు కష్టపడి స్వయంగా 60 అడుగుల లోతు బావి తవ్వాడు.అయితే అక్కడ అంతా కొండ, రాళ్ళు కూడా ఉన్నాయి.తను చనిపోయే లోపు ఎలాగైనా బావిని మరింత లోతుగా తవ్వి నీటిని అందుబాటులోకి తెస్తానని చెబుతున్నాడు.. మధ్యప్రదేశ్‌లోని సిధీకి చెందిన హరిసింగ్ తన భార్య కోసం ఈ కష్టసాధ్యమైన పనిని తలకెత్తుకున్నాడు.


హరిసింగ్ తన భార్య సియావతితో కలిసి ఓ కొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. వారు ఉండే ప్రాంతంలో నీటి వసతి లేదు. మంచినీరు కావాలంటే దాదాపు 2 కి.మి. నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకోవాలి. భార్య పడుతున్న కష్టాన్ని చూడలేక హరిసింగ్ తమకు దగ్గర్లోనే ఓ బావి తవ్వాలని మూడేళ్ల క్రితం నిర్ణయించుకున్నాడు. ఇప్పటివరకు 20 అడుగుల వెడల్పు, 60 అడుగుల లోతైన బావిని తవ్వేశాడు. కొద్దిపాటి నీరు రావడంతో అతని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. కొండ ప్రాంతం కావడంతో మరో 60 అడుగులు తవ్వితే తప్ప నీరు సమృద్ధిగా రాదు.తను చనిపోయే లోపు ఎలాగైనా పనిని పూర్తి చేస్తానని నమ్మకంగా చెబుతున్నాడు. `మొదట్లో ఈ పని చేయడం చాలా కష్టమనిపించింది. ఎందుకంటే మొత్తం రాయితో నిండిపోయిన ప్రాంతాన్ని తవ్వడం చాలా కష్టం. అయినా నేను వెనకడుగు వేయలేదు. ఈ ప్రపంచంలో అసాధ్యమనేది లేదు..నేను తప్పక సాధిస్తాను అని అతను గట్టిగా అనుకున్నాడు.. చుద్దాము ఏం అవుతుందో..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: