వైరల్ : బాక్సింగ్ మ్యాచ్.. ఒక్క పంచ్ తో ప్రత్యర్ధి కోమాలోకి?

praveen
సాధారణంగా బాక్సింగ్ రింగులో ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించూ కుంటూ ఉండడం చూస్తూ ఉంటాము. ఇక ప్రత్యర్థికి ఎక్కడ అవకాశం ఇవ్వకుండా ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ప్రతి బాక్సర్ కూడా ఇష్ట పడుతూ ఉంటాడు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా బాక్సింగ్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరుగుతున్న సమయంలో ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి ఇక్కడ ఇలాంటిదే జరిగింది. ప్రత్యర్థి పంచులకు బ్రెయిన్ లో ఇంటర్నల్ బ్లీడింగ్ అవడంతో మరొక బాక్సర్ చివరికి కోమాలోకి వెళ్లిపోయాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా మారిపోయింది.

 లైట్ వెయిట్ బాక్సర్లు సిమిసో, సిప్పిలే మధ్య ఇటీవలే బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్రికా లైట్ వెయిట్ బాక్సింగ్ టైటిల్ పోరు జరిగింది.. ఇక ఇద్దరూ ఎక్కడ ఒకరిపై ఒకరు ఆధిపత్యం కనబరిచెందుకు టప్ ఫైట్ చేశారు. అయితే పదవ  బౌట్ మొదలయ్యే వరకు  ఒకరిపై ఒకరు పంచులు వర్షం కురిపించుకున్నారు. అయితే ఇక పదవ బౌట్ మొదలవ్వడానికి కొద్ది నిమిషాల ముందు సిప్పిలే ఇచ్చిన ఒక పంచ్ తలలో బలంగా తగిలింది. దీంతో సిమిసో కళ్ళు బైర్లు కమ్మినట్లు ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాలేదు. ఈక్రమంలోనే బిత్తర చూపులు చూస్తూ రిఫరీ ఉన్న వైపుకు దూసుకు వెళ్ళాడు.  అయితే ఆ తర్వాత ప్రత్యర్ధి వెనకాల ఉంటే ఇది గమనించకుండా తన ముందు ఎవరు లేకపోయినప్పటికీ పంచ్ కొట్టె ప్రయత్నం చేశాడు.

 వెంటనే పరిస్థితిని అర్థం చేసుకున్న రెఫరీ మెడికోలను పిలిచాడు. దీంతో  సిప్పిలే  లైట్ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ గా అవతరించాడు. ఇక వైద్య సిబ్బంది సిమిసోను పరిశీలించి వెంటనే ఆసుపత్రికి తరలించగా అతను కోమాలోకి వెళ్ళిపోయి చికిత్స తీసుకుంటున్నాడు. సిప్పిలే ఇచ్చిన పంచుతో అతనికి బ్రెయిన్లో ఇంటర్నల్ బ్లీడింగ్ జరగడం కారణంగానే కోమాలోకి వెళ్ళాడు అన్నది తెలుస్తుంది. రెండు రోజులు గడిస్తే గానీ అతని పరిస్థితి ఏంటి అని చెప్పలేము అంటూ వైద్యులు కూడా చెబుతున్నారు.. కాగా ఇక ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: