పానిపూరి వ్యక్తి ఆలోచనకు ఫిదా అవ్వాల్సిందే..వైరల్..
ప్రపంచ వ్యాప్తంగా నీటి సంక్షోభం తీవ్రమవుతోంది. నీటిని పొదుపు చేసేందుకు, నీటిని ఎలా పొదుపు చేయాలనే దానిపై ప్రభుత్వాలు వివిధ కార్యక్రమాల ను అమలు చేస్తున్నాయి. నీటి పొదుపు పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 22న ప్రపంచ నీటి దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు. నీటిని పొదుపు చేయడం గురించి సోషల్ మీడియా లో విభిన్న పోకడలు, సందేశాలు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు పానీ పూరీ అమ్మకందారుడు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేకమైన పద్ధతిని అవలంబించాడు.
ప్రత్యేక పద్ధతి లో నీటిని పొదుపు చేయాలని ప్రజలకు మెసేజ్ ఇచ్చారు. ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. ఈ పోస్టర్‌ని చూస్తే, పానీ పూరీ అమ్మకందారు నీటిని పొదుపు చేయమని సందేశం ఇచ్చిన తీరును మీరు మెచ్చుకుంటారు. అయితే, ఈ పానీపూరి విక్రయదారుడు ఎక్కడి నుంచి వచ్చాడు, అతని దుకాణం ఎక్కడ అన్నది మాత్రం సమాచారం లేదు. కానీ నీటి పొదుపుపై ఇచ్చిన ప్రత్యేక సందేశం మాత్రం ప్రజల హృదయాల ను గెలుచుకుంది.. ఈ విషయం అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.. మొత్తాని కి అతడి ఆలోచన అందరినీ ఆకర్షించింది..