కొమరం భీముడో పాటకు స్పూఫ్.. నవ్వు ఆపుకోలేరు?

praveen
రాజమౌళి దర్శకత్వంలో ఐదు వందల కోట్ల బడ్జెట్ తో టాలీవుడ్ టాప్ హీరోలైన జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ఎంత మంచి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మార్చి 25వ తేదీన విడుదలైన ఈ సినిమా ప్రభంజనం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇంకా భారీ వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. కేవలం భారతదేశంలోనే కాదు అటు ఓవర్సీస్ లో కూడా ఊహించని రేంజిలో విజయాన్ని సాధించింది త్రిబుల్ ఆర్ సినిమా.


 ఇక ఈ సినిమాలో కొమురంభీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్చరణ్ నటించారు. త్రిబుల్ ఆర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఇక ఇద్దరూ కూడా పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అయితే  ఇక కొమరం భీమ్ పాత్రకు సంబంధించి సినిమా లో ఉండే కొమరం భీముడో పాట ఎంత పెన్షన్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సింగర్ కాలభైరవ పాడిన ఈ పాటలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన తీరు ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధుల్ని చేసింది. ఎంతోమందినీ కన్నీళ్లు కూడా పెట్టించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 అయితే ప్రస్తుతం ఎవరి నోట చూసిన కొమరం భీమూడో పాట వినిపిస్తుంది అని చెప్పాలి. ఇక కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోని నలుమూలల కూడా ఈ పాటకు మంచి క్రేజ్ వచ్చింది. ఇకపోతే ఇటీవల ఒడిషాలో కొమరం బీమూడో పాటకి స్పూఫ్ చేశారు. ఒకరు జూనియర్ ఎన్టీఆర్ లాగా తాళ్లతో బంధించి ఉండగా మరో యువకుడు రామ్చరణ్ లాగా మారి కొరడా దెబ్బలు కొడుతున్నాడు. అయితే సినిమాలో కొమరం భీముడో పాట విన్నప్పుడు ఎలా అయితే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయో ఇక ఇప్పుడు కూడా ఈ స్పూఫ్ చూస్తున్నంత సేపు నవ్వుతూ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతూ ఉంటాయి..Your browser does not support HTML5 video.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: