
వైరల్ : వామ్మో.. చిరుత ఎంత తెగించింది?
సాధారణంగా ఇంటి చుట్టూ పెద్ద గోడ.. ఎవరూ రాకుండా అడ్డుకోవడానికి పెద్ద గేటు ఉంది అంటే ఇక ఇంట్లో కి ఎలాంటి జంతువు కూడా రాలేదు అని ఎంతోమంది ధైర్యంగా ఉంటారు. కానీ ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన చూస్తే మాత్రం చుట్టూ ఎన్ని రక్షణగా ఉన్నప్పటికీ చిరుత లాంటి జంతువుల దాడి నుంచి తప్పించుకోవడం చాలా కష్టం అన్నది అర్ధమవుతుంది. ఎందుకంటే ఇటీవలే జనావాసాల్లోకి వచ్చిన వచ్చిన చిరుత ఏకంగా ఒక పెంపుడు కుక్కను నోటకరిచి పట్టు కెళ్ళింది. ఇందులో కొత్తేముంది అని అనుకుంటున్నారా.. ఎక్కడో బయట కనిపించిన కుక్కను కాదు ఏకంగా గేటు దూకి ఇంట్లోకి వచ్చిన చిరుత.. కుక్క ను పట్టుకుని లాక్కెళ్ళింది.
ఇక దీనికి సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. ఇక ఈ ఘటన గగుర్పాటుకు గురిచేస్తుంది అనే చెప్పాలి. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ ఇక ఈ వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ఇది చూసి ఎంతో మంది ఆశ్చర్యపోతున్నారు. రాత్రిపూట ఇంటి ఎదురుగా వెళ్తున్న చిరుతను చూసి లోపల ఉన్న పెంపుడు శునకం అరవడం మొదలు పెట్టింది. ఇక ఇది గమనించిన చిరుత ఒక్కసారిగా ఇంటి వైపు దూసుకు వచ్చి.. ఏకంగా గేటు దూకి నోటకరిచి శునకాన్ని తీసుకెళ్ళింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి.