వైరల్ : అవును.. ఇతను మనిషి కాదు దేవుడే?

praveen
ఉరుకుల పరుగుల జీవితం..కుటుంబం ఉద్యోగం గురించి తప్ప మిగతా ఏ విషయం గురించి పట్టించుకునే సమయం అసలు మనిషికి లేకుండానే పోయింది. రోడ్డుపై వెళ్తున్న సమయంలో పక్కనే మనిషి చావు బతుకుల మధ్య ఉంటే.. అయ్యో ఆఫీస్ కి టైం అయిపోతుంది ఇప్పుడు ఎలా.. నేను కాకపోతే ఇంకెవరైనా  వచ్చి కాపాడుతారులే అంటూ చేతులు దులుపుకుని   వెళ్ళిపోతున్న జనాలే నేటి రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలా మనిషి ప్రాణాలనే లెక్క చేయని జనాలు వానరాలు ప్రాణాపాయ స్థితిలో ఉంటే పట్టించుకుంటారా?

 అటు వైపు కూడా కన్నెత్తి చూడరు. ఇలాంటి సమాజంలో ఇంకా మానవత్వం బ్రతికే ఉంది అని నిరూపించాడు ఇక్కడ ఒక వ్యక్తి. చావు బతుకుల్లో ఉన్న మనుషులకే సహాయం చేయడానికి జనాలు వెనక ముందు ఆలోచిస్తుంటే.. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం రోడ్డుపై ప్రాణాపాయ స్థితిలో పడి ఉన్న కోతిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాడు. ఇక దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది మాటలకందని మానవత్వం అంటూ ఎంతో మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం పెంబాలురు లోని కున్నాం తాలూకాకు చెందిన 38 ఏళ్ల ప్రభు అనే వ్యక్తి కార్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.

 ఇటీవల డిసెంబర్ 9వ తేదీన విహారయాత్రకు వెళ్ళాడు. ప్రభు ఇక తిరుగు ప్రయాణం సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు ద్విచక్ర వాహనాన్ని ఒక చోట ఆపాడు.. రోడ్డు పక్కనే ఉన్న చెట్టు క్రిందికి వెళ్లారు. ఇక అక్కడే కుక్కలు ఒక కోతిని దారుణంగా నోటా కరుస్తున్నాయి. దీంతో గమనించిన ప్రభు ఆ కుక్కలను అక్కడినుంచి తరిమేశాడు.  ఇక ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ కోతికి ప్రథమ చికిత్స అందించడానికి ప్రయత్నించాడు.. ఏకంగా గుండెను పంపింగ్ చేయడం ప్రారంభించాడు.. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో కోతికి సిపిఆర్ చేసి ఏకంగా నోటిద్వారా కోతికి శ్వాస అందించాడు. దీంతో కోతి ఒక్కసారిగా స్పృహలోకి రావడంతో ఆనందంతో ఊగి పోయాడు ప్రభు. ఆ తర్వాత మళ్లీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించాడు. ఇక ప్రస్తుతం తమిళనాడుకు చెందిన ప్రభు పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సరైన సమయానికి దేవుడిలా వచ్చి ఆ కోతిని కాపాడాడు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: