షాకింగ్ : ఊర్లోకి వచ్చిన భారీ కొండచిలువ, మొసలి...!

MADDIBOINA AJAY KUMAR
ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇది వరకు వర్షాకాలం వచ్చిందంటే జంతువులు పక్షులు అడవుల్లోనే ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేవి. కాని ప్రస్తుతం అడవులు ఎక్కువగా నరికి వేయడంతో భారీ వర్షాలకు జంతువులు పక్షులు తలదాచుకునేందుకు ఊర్లోకి రావడం కనిపిస్తోంది. ఇక వర్షాలు కురిసినప్పుడు నగరాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు.. డ్రైనేజీ సమస్యలు, ఇళ్లల్లోకి నీళ్ళు రావడం లాంటి సమస్యలు వస్తే గ్రామాలు, పల్లెల్లో చుట్టుపక్కల ఉన్న అడవి ప్రాంతాల నుండి జంతువులు పాములు రావడం కలకలం రేపుతోంది. తాజాగా అలాంటి ఘటనే గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

గుజరాత్ లో ఓ గ్రామంలోకి 2 భయంకరమైన జీవులు ప్రవేశించాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గుజరాత్ లోని వడోదర సమీపంలో ఉన్న ఓ గ్రామంలో పెద్ద చెరువు ఉంది. ఆ చెరువు లో నుండి ఆరు అడుగుల మొసలి మరియు పక్కనే ఉన్న అడవి నుండి 14 అడుగుల కొండచిలువ గ్రామంలోకి చేరుకున్నాయి. ఆ రెండింటిని చూసిన స్థానికులు భయంతో వణికి పోయారు. అయితే గ్రామస్తులు వాటిపై దాడి చేయకుండా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు.

దాంతో ఫారెస్ట్ అధికారులు అక్కడికి చేరుకొని ముసలి మరియు కొండ చిలువను సంరక్షించి వన్య ప్రాణి సంరక్షణ కేంద్రానికి తరలించారు. ఫారెస్ట్ అధికారులు పాము మొసలి ని చాలా జాగ్రత్తగా పట్టుకున్నారు. అనంతరం ఫారెస్ట్ అధికారి అరవింద్ పవర్ మాట్లాడుతూ... వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. గ్రామాల్లోకి పాములు ఇతర జంతువులు ప్రవేశించినప్పుడు తమకు సమాచారం అందించాలని సూచించారు. ఇక రెస్క్యూ సిబ్బంది కొండచిలువ మొసలి ని పట్టుకోవడంతో గ్రామస్థులు అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఇటీవల ఏపిలో కూడా భారీ వర్షాలకు ఓ మొసలి రోడ్డు దాటుతూ లారీ కింద పడి చనిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: