Video : యువతి హల్ చల్.. పీకల దాకా తాగి రోడ్డును బెడ్డులా.. !

MADDIBOINA AJAY KUMAR
ఫుల్ గా తాగితే కొంతమంది తమ తమే మర్చిపోతూ ఉంటారు. ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం... అనేది సైతం గుర్తు ఉండదు. అలా చేసే క్రమంలో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తారు. ముఖ్యంగా తాగుబోతులు రోడ్డుపైకి వచ్చి చేసే విన్యాసాలు అన్నీ ఇన్నీ కాదు. పీకలలోతు వరకు తాగి రోడ్డుపైకి వచ్చి పడుకుంటారు. లేదంటే వాహనాలను ఆపుతూ నానా హంగామా చేస్తారు. ఇక ఎవరైనా పూసుకున్న యాక్సిడెంట్ చేస్తే వారిని పట్టుకుని వేదిస్తారు. అయితే ఎక్కువగా మగవాళ్లే ఫుల్ గా తాగి రోడ్డుపైకి వచ్చి విన్యాసాలు చేస్తూ ఉంటారు. ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తుంటారు. సాధారణంగా మన భారతీయులలో ఆడవాళ్ళు చాలా తక్కువ శాతం మంది తాగుతారు. అది కూడా ఎవరి ఇళ్లలో వాళ్ళు లేదంటే పార్టీలు, పబ్బుల్లో తాగి ఎంజాయ్ చేస్తారు. అంతే కానీ రోడ్లపైకి తాగి వచ్చి ఎప్పుడూ హంగామా చేయరు. కానీ ఇటీవల కాలంలో మహిళలు సైతం రోడ్లపై హంగామా చేయడం చూస్తూనే ఉన్నాం. 

తాగడం ట్రాఫిక్ పోలీసులకు దొరికిపోయి వారితో వాదించడం. లేదంటే అక్కడి నుంచి పారిపోవడం ఇలాంటి అనేక ఘటనలు చూశాం. ఇక ఇటీవల లక్నోలో ఓ యువతి ఫుల్ గా తాగి రోడ్డుపై నడుస్తుందగా దగ్గరగా వచ్చి బ్రేక్ కొట్టిన క్యాబ్ డ్రైవర్ ను తప్పు లేకుండానే కొట్టింది.  ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. అసలు విషయం తెలియని నెటిజన్లు యువతిని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేశారు. ఆడపులి అది ఇది అని పొగిడారు. నిజానికి ఆ వీడియో లో డ్రైవర్ తప్పేమీ లేదని క్లారిటీగా కనిపిస్తుంది  రోడ్డుపై తాగి అడ్డంగా నడుచుకుంటూ వెళితే  డ్రైవర్ తప్పు చేశాడని కొట్టడం ఎంతవరకు న్యాయం. ఇక సీసీ కెమెరాలో ఈ వీడియో రికార్డు అవడం తో పోలీసులు ఆ యువతి పై కేసు పెట్టారు. దాంతో సదరు యువతి పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఇక తాజాగా మరో యువతి ఫుల్ గా తాగి మెయిన్ రోడ్డు ను బెడ్ రూమ్ లాగా ఫీల్ అయింది. మహారాష్ట్ర లోని పూణేలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువతి పూణేలో రోడ్డుపై హాయిగా పడుకుని విన్యాసాలు చేసింది. బోర్లా పడుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చి నట్టు చేసింది. ఇక ప్రస్తుతం ఈ వీడియో కూడా వైరల్ అవుతోంది. దాంతో నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. అక్కడ వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: