వైరల్ : మీకు ఈ పెన్ హాస్పిటల్ గురించి తెలుసా...?

frame వైరల్ : మీకు ఈ పెన్ హాస్పిటల్ గురించి తెలుసా...?

Suma Kallamadi
ఇప్పుడంతా కంప్యూటర్ యుగం. ఒకప్పుడు చాలా మంది డైరీ రాసేవారు. ఇప్పుడు మాత్రం కొందరు కంప్యూటర్ లో నోట్స్ రాసుకుంటున్నారు. పిల్లల దగ్గరి నుంచి పెద్దల వరకూ అందరూ కూడా ఐప్యాడ్ లు, ల్యాప్ టాప్ లు, స్మార్ట్ ఫోన్లలో రాసుకోవడం అలవాటైపోతోంది. ఏది ఏమైనప్పటికీ పెన్ను పట్టి పుస్తకం మీద రాస్తేనే ఆ కిక్కు అనేది ఉంటుంది. రానురాను పెన్నుల వాడకం తగ్గిపోతోంది. అయినప్పటికీ పెన్ను అనేవి తరిగిపోవడం లేదు. మరి ఇప్పుడు ఏపీలో పెన్ హాస్పిటల్ కూడా ఉండటం అందర్నీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఒకప్పుడు జేబులో పెన్ను పెట్టుకుని చాలా మంది హుందాగా ఉండేవాళ్లు. ఆ రోజుల్లో పెన్నులో ఇంక్ అయిపోతే రీఫిల్స్ మార్చుకుంటారు లేదంటే ఇంకు మార్చుతారు. ఒక వేళ పెన్ను పాడైతే రిపేర్  చేసుకోరు. మరి అటువంటి వారి కోసమే శ్రీకాకుళంలో వెరైటీగా పెన్ ఆస్పత్రి ఏర్పాటైంది. ఇలాంటి ఆస్పత్రి ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

శ్రీకాకుళంలోని సెవెన్ రోడ్ జంక్షన్ వద్ద ఈ పెన్ హాస్పిటల్ ఉంది. ఇందులో రెండు రూపాయల దగ్గరి నుంచి 20 వేల రూపాయల వరకు కూడా పెన్నులనేవి మనకు లభిస్తాయి. అలాగే వారు అమ్మేటటువంటి పెన్నులకు జీవితాంతం కూడా వారే ఫ్రీ సర్వీస్ అనేది చేయడం విశేషం. పెన్నులను ఓ ప్రత్యేక విధానంలో శుభ్రం చేసి పాడైపోయిన వాటిలో మళ్లీ ఇంకును వేస్తారు. ఇందులో లభించేటటువంటి ఖరీదైన పెన్నుల్లో ఖరీదైన రీఫిల్స్ ను మాత్రమే వాడాల్సి ఉంటుంది. అయితే అంత ఖర్చు చేయలేమని చెప్పినప్పటికీ మనకు తక్కువ ధరకే రీఫిల్స్ కూడా లభిస్తాయి. ఎన్నో సంవత్సరాలకు పూర్తం వారి పూర్వీకులు ప్రారంభించిన ఈ పెన్ హాస్పిటల్ ఇప్పటికీ కొనసాగిస్తుండటం గొప్ప విషయమనే చెప్పొచ్చు. శ్రీకాకుళంలోని పేర్ల వీధికి చెందిన పొట్లూరి రాజారావు, ఆనందరావు సోదరులు 1970వ సంవత్సరంలో పెన్నుల బిజినెస్ స్టార్ట్ చేసి ఇప్పటికీ కొనసాగిస్తుండటం గొప్ప విషయమనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: