సత్య నాదెళ్ల జీవితంలో మనసు కరిగే కష్టాలు..!

Divya

సత్య నాదెళ్ల.. గత ఎనిమిది సంవత్సరాలుగా (2014) మైక్రోసాఫ్ట్ సీఈవోగా కొనసాగుతున్న తెలుగుతేజం. అంతేకాదు ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల మొదటి స్థానానికి చేరుకున్నారు. ఫార్చ్యూన్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ 2019 జాబితాలో, ప్రథమ స్థానాన్ని సొంతం చేసుకున్న ఏకైక భారతీయ సంతతిగా రికార్డు సృష్టించారు. ఇక అంతే కాదు గత కొన్ని సంవత్సరాలుగా మనదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాలో, చోటు దక్కించుకున్న సత్య నాదెళ్ల తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సరికొత్తగా మెరుగుపరుచుకుంటున్నారు.
అయితే ఇంతటి గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఈయన జీవితంలో కూడా, కొన్ని అలుపెరుగని కష్టాలు ఉన్నాయని చాలా మందికి తెలియదు. అందరికీ ఒక ప్రశ్న ఎదురవ్వచ్చు.. ఈయన తండ్రి ఐఏఎస్ కదా ! మరి ఈయనకు  ఎందుకు కష్టాలు ఉంటాయి.. అందులోనూ ఈయన ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల లిస్టులో ఉన్నారు కదా ! ఇక ఏ విషయంలో సమస్యలు వస్తాయి.. అనే  సందేహం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. కాకపోతే ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక కష్టం ఎదురు కావచ్చు. అది ఆర్థికంగా అయినా లేదా కుటుంబ పరంగా అయినా కావచ్చు. ఇక ఈయనకు ఆర్థికంగా ఎలాంటి నష్టం కష్టం లేదు కాబట్టి ,కుటుంబ సమస్యలే  ఈయనను తలమునకలు అయ్యేలా చేశాయి. ఇక ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న అలాగే ఎదుర్కొంటున్న కష్టనష్టాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

సత్య నాదెళ్ల.. ఐఏఎస్ అధికారి బుక్కాపురం నాదెళ్ల యుగంధర్ అలాగే ప్రభావతి యుగంధర్ లకు 1967 లో జన్మించారు. ఇక ఈయనకు ఒక చెల్లి కూడా ఉండేది. కానీ ఆమె సత్య ఐదు సంవత్సరాల వయసులో మరణించడంతో, సత్య కొన్ని సంవత్సరాల పాటు కోలుకోలేకపోయారు.. ఇక సత్య తన చెల్లెలు లేదన్న బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టినా, ఆ తరువాత అంచెలంచెలుగా ఎదుగుతూ మైక్రోసాఫ్ట్ సీఈవో గా ఎదిగారు. ఇక సత్య 1992లో మైక్రోసాఫ్ట్ లోకి ప్రవేశించారు. ఇక అదే సంవత్సరంలోనే మరో ఐఏఎస్ అధికారి కూతురు,తన చిన్న నాటి స్నేహితురాలు అయిన అనుపమ ను 1992 లో వివాహం చేసుకున్నారు.
వీరికి ముగ్గురు పిల్లలు..ఇద్దరు కుమార్తెలు, ఒక అబ్బాయి. అబ్బాయి పేరు జైన్. ఈ అబ్బాయికి ప్రస్తుతం 24 సంవత్సరాలు. కానీ ఈ అబ్బాయి పుట్టుకతోనే సెరిబ్రల్ పాల్సీ తో జన్మించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వీల్ చైర్ కి తన జీవితాన్ని అంకితం చేసుకున్నారు. ఇక ఈ అబ్బాయి నడవలేడు, చూడలేడు అలాగే సరిగ్గా మాట్లాడలేడు. ఇక ఈ బాధను భరించలేక ఎన్నో హాస్పిటల్స్ చుట్టూ కూడా తిరిగి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ ఫలితం లభించలేదు. ఒకవైపు తన కొడుకు పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ , ప్రపంచాన్ని ముందడుగు వేయించాలనే తపనతో ఎప్పుడూ శ్రమిస్తూనే వస్తున్నారు.

సత్య వాళ్ళింటికి ముగ్గురు సాఫ్ట్ వేర్  ఇంజనీర్ లు వచ్చేవారు. ఇక వారు సత్య కొడుకు జైన్ పరిస్థితిని అర్థం చేసుకొని, ఒక సాఫ్ట్ వేర్ ను రూపొందించారు. అదే "Seeing AI "అనే ఆండ్రాయిడ్ యాప్ ద్వారా డిసబులిటీ తో బాధపడుతున్న వ్యక్తికి తన ముందు జరగబోయే విషయాలన్నీ,ఆ యాప్ చక్కగా వివరిస్తుంది. వివరించడమే కాకుండా ముందున్న వ్యక్తి భావాలను కూడా వ్యక్తీకరిస్తుంది. ఇక మన చుట్టూ ఉన్న పరిస్థితులను కంటికి కట్టినట్టు చూపించడమే ఈ యాప్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇలా ఎంతో మంది ఈ సమస్యతో బాధపడుతున్న వారికి చక్కటి అనుభూతిని అందించడానికి కారణం సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లే కారణమని చెబుతూ ఉంటారు సత్య నాదెళ్ల.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: