బర్త్ డే బాయ్ కి షాక్ ఇచ్చిన ఫోమ్.. చివరికి?

Satvika
బర్త్ డే చేసుకోవడం అంటే చాలా మందికి సరదాగా ఉంటుంది. తమకున్న ఫ్రెండ్స్ వల్ల ఆ సెలబ్రేషన్స్ లో ఇంకాస్త ఉషారు పెరుగుతుంది. ఇప్పుడు బర్త్ డే పార్టీలను ఒక్కొక్కరు ఒక్కో విధంగా జరుపుకుంటారు. ఒక్కోసారి అలాంటి పార్టీల లో అపశృతి దొర్లుతుంటాయి. ప్రమాదాలకు కూడా దారి తీస్తాయి. అలాంటి ఒక ఘటనే ఇప్పుడు ఎదురైంది. సరదాగా ఫ్రెండ్స్ వేసిన స్నో ఫోమ్ ముఖానికి గాయాన్ని మిగిల్చింది. అతని ముఖానికి మంటలు అంటుకోడం తో అందరూ షాక్ కు గురయ్యారు..


బర్త్‌డే బాయ్‌ పై అతడి స్నేహితులు స్నో ఫోమ్‌ చల్లారు. అతడు కేక్‌ కట్‌ చేయబోగా వెలుగుతున్న క్యాండిల్‌ కారణంగా ముఖం మీద ఉన్న ఫోమ్‌కు మంటలు అంటుకున్నాయి. దీంతో కంగారుగా అతడు పక్కకు పరుగెత్తాడు. భయాందోళన కు గురైన స్నేహితులు అతడికి సహాయం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన వల్ల ఆ వ్యక్తి పుట్టిన రోజు వేడుక విషాదంగా మారింది. ఈ షాకింగ్ ఘటన న్యూ ఢిల్లీ లో వెలుగు చూసింది.


ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో హల్ చల్ చేస్తుంది. పార్టీల సందర్భంగా చల్లే ఫోమ్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని అందులో పేర్కొన్నారు. 'పార్టీల లో చల్లే ఫోమ్స్‌ లో రసాయనాలు ఉంటాయి. అవి కంటికి మంచివి కాదు. కండ్ల ఇరిటేషన్‌ కలిగిస్తాయి. స్నో ఫోమ్స్‌కు మండే గుణం ఉంటుంది. వాటి బాటిల్స్ ‌పై ఈ హెచ్చరికతో కూడిన సంకేతాలు కూడా ఉంటాయి. మంటల పై చల్లవద్దని అందులో ఉంటుంది. అయినప్పటికీ పుట్టిన రోజు వంటి వేడుకల్లో క్యాండిల్‌ మండుతుండ గా ఫోమ్స్‌ను స్ప్రె చేస్తుంటారు. ఫలితంగా ఇలాంటి ప్రమాదాలు  జరగడం ఖాయమని  హెచ్చరించారు. ఈ వీడియో పై నెటిజన్లు పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. పార్టీల కన్నా ప్రాణాలు ముఖ్యం.. జాగ్రత్త సుమీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: