ట్రక్కును ఢీ కొట్టిన విమానం.. చివరికి ఏమైందో చూడండి?

praveen
సాధారణంగా ఎయిర్పోర్టులో విమానం దూసుకుపోయే రన్  వే పై ఎలాంటి వాహనాలు ఉండకుండా ఇక ఎయిర్పోర్ట్  అధికారులు ఎప్పుడూ అప్రమత్తంగా ఉంటారు అన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా రద్దీగా ఉండే ఎయిర్పోర్టులో అయితే విమానాలు ఎప్పుడు టేక్ ఆఫ్ అవుతాయి ఎప్పుడు ల్యాండ్ అవుతాయి అన్నది కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఇక ఏ రన్ వే పైకి విమానం వస్తుంది అన్నది కూడా ఊహకందని విధంగానే ఉంటుంది. అయితే రన్ వే పై పరుగులు పెట్టే విమానంకు ఏ చిన్న వాహనం ఢీకొన్న కూడా భారీ నష్టం జరిగే అవకాశం ఉంటుంది అని చెప్పాలి.

 ఇకపోతే ఇటీవలే పెరులో జరిగిన ఒక విమాన ప్రమాదానికి సంబంధించిన వీడియో మాత్రం ట్విట్టర్  వేదికగా తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఏకంగా రన్ వే పై దూసుకుపోతున్న ఒక విమానం అగ్నిమాపక యంత్రాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక పెద్ద ప్రమాదం జరిగింది అని చెప్పాలి. అయితే ముందుగా రన్ వే పై విమానం దూసుకుపోతుండగా ఊహించని విధంగా అగ్నిమాపక యంత్రం ఆ విమానానికి ఎదురుగా వెళ్లడం గమనార్హం. దీంతో పైలట్ ఏమి చేయాలని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇక వేగంగా దూసుకుపోతున్న విమానం ఇక అగ్నిమాపక యంత్రాన్ని ఢీకొట్టింది.

 పెరులో ఉన్న జార్జ్ చావేజ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.. విమానంలో  ఉన్న ప్రయాణికులకు సిబ్బందికి మాత్రం ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.  కానీ ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది మాత్రం అక్కడికక్కడే మరణించారు. ఇలా ఏకంగా గాలిలో నుంచి వేగంగా విమానం ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది అన్నది తెలుస్తుంది. అయితే ఫ్లైట్ ఎదురుగా దూసుకు వస్తూ ఉండడానికి గమనించిన ట్రక్ డ్రైవర్ అప్పుడే వెహికల్ ను పక్కకు తప్పించే ప్రయత్నం చేసినట్లు ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో కనిపిస్తుంది. కానీ అంతలోపే విమానం వచ్చి ఆ ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో మంటలు పొగలు చిమ్ముతూ అంతే వేగంతో ఫ్లైట్ ముందుకు దూసుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: