JIO కి దిమ్మతిరిగిపోయే షాక్ ఇచ్చిన BSNL...!!!

NCR

నెట్ ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని, ఎదురు లేని శక్తిగా దూసుకుపోతున్న జియో. ఎన్నో సంచలనాలని సృష్టించింది. హై స్పీడ్ డేటా అందించడమే కాకుండా ఎవరూ ఊహించని తీరిలో సంవత్సర ప్లాన్ 1699 తో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ ప్లాన్ కి పోటీగా ఇప్పటి వరకూ పోటీ దారులు ఎవరూ కూడా ఎదురు నిలబడలేక పోయారు. కానీ ప్రభుత్వ రంగ సంస్థ BSNL మాత్రం జియో కి ఊహించని షాక్ ఇచ్చింది. నీకు పోటీ నేనే అంటూ ఒక్క సారిగా సంవత్సర ప్లాన్ లో భారీ మార్పులు చేపట్టింది.

 

జియో 1699 ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ తో పాటు 100 మెసేజ్ లు ఉచితంగా, రోజుకి 1.5 జీబీ డేటా తో వాయిస్ కాల్స్ , హై స్పీడ్ డేటా ఇస్తోంది. BSNL కూడా ఇంచుమించు ఇదే విధంగా ప్లాన్ ప్రకటించింది.కానీ తాజాగా ఈ ప్లాన్ ని BSNL అప్డేట్ చేసింది. గతంలో 365 రోజులు ఉన్న గడువుని 90 రోజులు పొడిగించింది. అంటే ఇప్పుడు 1699 తో రీచార్జ్ చేసుకుంటే 455 రోజుల వ్యాలిడిటీ వర్తిస్తుంది. ఈ కొత్త ప్లాన్ ని తాజాగా BSNL ప్రకటించింది అంతేకాదు

 

రోజుకి 2 జీబీ డేటా ఉచితంగా అందించనుంది.అలాగే 100 టెక్స్ట్ మెసేజ్ లు ఉచితంగాను, హై స్పీడ్ డేటా ని అందిస్తోంది. మరొక భంపర్ ఆఫర్ కూడా ప్రకటించింది BSNL అదేంటంటే. ఈ ప్లాన్ రీచార్జ్ చేసుకున్న వాళ్లకి సుమారు రోజుకి మరో అదనపు 2 .2 జీబీ డేటా ఉచితంగా అందించనుంది. అంటే మొత్తం 4.2 జీబీ డేటా BSNL తన వినియోగ దారులకి ఇస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆగస్టు 14 నుంచీ సెప్టెంబర్ 13 వరకూ మాత్రమే అందుబాటులో ఉండనుందని ప్రకటనలో తెలిపింది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: