మీ జిమెయిల్ స్టోరేజీ పూర్తిగా నిండిపోతే ఇలా చేస్తే సరిపోతుంది!
నేటి యాంత్రిక కాలంలో జిమెయిల్ అకౌంట్ లేకుండా ఏ ఒక్కరు ఉండరు అనేది తెలిసిన విషయమే. అదేవిధంగా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికి జీమెయిల్ అకౌంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఈమెయిల్ అకౌంట్ లేకుండా అసలు ఫోన్ ఆన్ చేయడమే చాలా కష్టం. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఇది తప్పనిసరి కావడంతో జిమెయిల్ అకౌంట్ అనేది తప్పనిసరి అయిపోయింది. అయితే గత కొంతకాలంగా స్మార్ట్ ఫోన్ యూజర్లను ఒక సమస్య వేధిస్తోంది. నీ జీమెయిల్ స్టోరేజీ 15 జిబి పూర్తిగా అయిపోయిందని ఓ మెసేజ్ వస్తూ, ఇంకాస్త స్పేస్ కావాలంటే కొనుగోలు చేయమని గూగుల్ మెసేజ్ లు పెడుతుండడంతో చాలామంది వినియోగదారులు కంగారుపడుతున్నారు.
అయితే ఇక్కడ అందరికీ స్పేస్ కోసం డబ్బులను వెచ్చించే స్తోమత అందరికీ ఉండకపోవచ్చు. సాధారణంగా ఫోన్ వాడుతున్న ప్రతి ఒక్కరూ, ఫోటోలు వీడియోలు క్రమం తప్పకుండా తీయడంతో, ఆ 15 జిబి కొద్ది సమయంలోనే బ్యాకప్ రూపంలో నిండిపోవడంతో ఇలాంటి సమస్యలు తలెత్తుతున్నాయని ఇట్టే మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటప్పుడు కొన్ని చిట్కాలు ద్వారా స్టోరేజీని మ్యారేజ్ చేసుకోవచ్చని కొంతమంది నిపుణులు చెబుతున్నారు.
దానికోసం గూగుల్ స్టోరేజ్ ఆప్షన్ లోకి వెళ్లి 'క్లీన్ అప్' ఆప్షన్ ఎంచుకొని అవసరమైన డేటాను ఉంచుతూ, అవసరం లేని డేటాను డిలీట్ చేయడం ద్వారా కొంత మేర స్పేస్ సంపాదించవచ్చు. అదేవిధంగా, ఎక్కువ మోతాదులో స్పేస్ ఆక్యుపై చేసిన ఫైళ్లను కంప్రెస్ (కుదించడం) చేయడం ద్వారా మరికొంత స్పేస్ పునరుద్ధరణ చేయవచ్చు. అదేవిధంగా ఎక్కువగా ఎవరైనా గూగుల్ క్రోమ్ వంటి వాటిని వాడినట్లయితే, అందులోని గత హిస్టరీని తొలగించడం ద్వారా కొంతమేర స్పేస్ సంపాదించవచ్చు. ఇక స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మీరు ఎలాంటి ఫోటోని క్లిక్ చేసిన, అది గూగుల్ క్లౌడ్ లో స్టార్ కాబడుతుంది కాబట్టి, అవసరమైనప్పుడు మాత్రమే మీ ఫోన్ కెమెరాను వాడవలసిందిగా నిపుణులు సూచిస్తున్నారు.