బుల్లి పిట్ట: బోట్ నుంచి మరో స్మార్ట్ రింగ్.. మహిళలకు ప్రత్యేకం..!!
సిరామిక్ మెటల్ కాంబినేషన్ తో ఉన్న ఈ స్మార్ట్ రింగ్ బరువు తక్కువ ధరించడానికి సౌకర్యంగా కూడా ఉంటుంది..ఈ స్మార్ట్ రింగులు అనేక రకాల స్మార్ట్ ఫీచర్స్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.. ప్రధానంగా హెల్త్ ట్రాకర్ ఫిట్నెస్ ట్రాకర్ గా పనిచేస్తుంది.. ఆరోగ్యానికి సంబంధించిన పలు సమాచారాన్ని కూడా అందిస్తూ అడ్వాన్స్డ్ ఫిచర్ ను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. ఇందులో ఆరు యాక్సిస్ మోషన్స్ సెన్సార్లు కలవు.. వాటర్ స్వీట్ రెసిస్టెంట్ తో ఈ స్మార్ట్ రింగ్ ఉంటుందట. నిన్నటి రోజు నుంచే ఈ స్మార్ట్ రింగు యొక్క అమ్మకాలను మొదలుపెట్టింది బోట్ సంస్థ.
ఈ స్మార్ట్ రింగ్ స్త్రీలలో నెలసరి సైకిల్ ట్రాక్ చేసుకొని సరికొత్త ఫీచర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.. స్మార్ట్ టచ్ కంట్రోల్ తో ఈ స్మార్ట్ రింగును సైతం ఆపరేటింగ్ చేయవచ్చట..అలాగే మనం వాకింగ్ చేసిన రోజుకి ఎన్ని అడుగులు నడిచారు ఎన్ని క్యాలరీ కరిగించారు అనే వివరాలను కూడా తెలుసుకోవడంతో పాటు హార్ట్ రేటింగ్ కూడా తెలుసుకోవచ్చు. ఒక బాడీ టెంపరేచర్ కూడా ఈ స్మార్ట్ రింగ్ తెలియజేస్తుంది.. అలాగే బోట్ రింగ్ యాప్ తో ఈ స్మార్ట్ రింగును యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని ధర ప్రస్తుతం రూ.8,999 రూపాయలు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో ఉన్నది.