బుల్లి పిట్ట: రూ.6999లకే శాంసంగ్ స్మార్ట్ మొబైల్..!!

Divya
ప్రస్తుతం ఎక్కువగా మొబైల్స్ ఉపయోగిస్తూ ఉన్నారు అందుకు అనుకూలంగానే మొబైల్స్ అట్రాక్ట్ చేసే విధంగా పలు దిగ్గజ సంస్థలు పలు రకాల ఆఫర్లను కూడా ప్రవేశపెడుతున్నాయి.అలా అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ మరో రెండు రోజుల్లో ప్రారంభం కాబోతోంది. ఈ సేల్ ముందు టాప్ బ్రాండెడ్ కలిగిన స్మార్ట్ మొబైల్స్ పైన పలు రకాల ఆఫర్లను అమెజాన్ అందించబోతోంది. అమెజాన్ నుండి సామ్సంగ్ గెలాక్సీ M సిరీస్ కలిగిన స్మార్ట్ మొబైల్ లో భారీ డిస్కౌంట్ తో తక్కువ ధరకే తమ కస్టమర్ల కోసం ఆఫర్ ని ప్రకటించినట్లుగా తెలుస్తోంది. ఈ తాజా ఆఫర్ కలిగిన మొబైల్ పైన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

అమెజాన్ ఈరోజు సామ్సంగ్ గెలాక్సీ M04 స్మార్ట్ మొబైల్ ను 42% డిస్కౌంట్తో రూ.6,999 రూపాయలకే కస్టమర్లకు అందించే విధంగా ఆఫర్ ను ప్రకటించింది. ఈ స్మార్ట్ మొబైల్ ఎంత తక్కువ ధరకు అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. ఈ మొబైల్ అమెజాన్ లో లేకపోతే శాంసంగ్ స్టోర్లలో కూడా లభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆఫర్ కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మరి సాంసంగ్ మొబైల్ యొక్క ఫీచర్ల విషయానికి వస్తే..
సాంసంగ్ గెలాక్సీ-M04:
సాంసంగ్ గెలాక్సీ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే తో పాటు 13 mp మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా కలదు.. అలాగే 2ఎంపీ డ్యూయల్ కెమెరా సెటప్ కూడా కలదు. సెల్ఫీ ప్రియుల కోసం 5 mp సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది ఈ మొబైల్ 4జిబి ర్యామ్కు జతగా 4GB వర్చువల్ ర్యామ్ కూడా కలదు. ఈ మొబైల్ 128 జిబి స్టోరేజ్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12,OS ఆధారపైన పనిచేస్తుందట ఈ మొబైల్ ఛార్జింగ్ సపోర్ట్ విషయానికి వస్తే 5000 MAH సామర్థ్యంతో కలదు. స్టోరేజ్ వేరియేషన్ను బట్టి మార్పులు ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: