బుల్లి పిట్ట: తక్కువ ధరకే ఆకర్షణమైన మొబైల్..!!

Divya
ఇండియాలో మొబైల్ తయారీ సంస్థలలో లావా మొబైల్ బ్రాండ్ సంస్థ కూడా ఒకటని చెప్పవచ్చు. ఈ బ్రాండెడ్ గల స్మార్ట్ ఫోన్లు ఇండియాలో విడుదల అవ్వతూ ఉంటాయి. ఇటీవలే BLAZE సిరీస్ నుండి సరికొత్త స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించింది లావా.అవి కూడా కేవలం తక్కువ ధరలకే ఆకర్షణీయమైన ఫిచర్లతో అందిస్తోంది. ఇప్పుడు వాటి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడమే కాకుండా ఫ్యూచర్లో ధర విషయలు కూడా తెలుసుకుందాం.

లావా మొబైల్ ధర విషయానికి వస్తే రూ.8000 రూపాయల కంటే తక్కువ ధరలోనే ఈ మొబైల్ లభిస్తుంది. LAVA yuva PRO అయితే  స్మార్ట్ మొబైల్ ఆండ్రాయిడ్ 12,0S ఆధారంగా పనిచేస్తుంది.ఇక కెమెరా విషయానికి వస్తే త్రిబుల్ కెమెరాతో కలదు ఇక బ్యాటరీ వంటి  సరికొత్త ఫిచర్లను కూడా ఈ మొబైల్ కలిగి ఉంది . ఈ మొబైల్ అధికారిక ఈ స్టోర్ లో నుండి లభిస్తుంది. ఇక పలు బ్యాంకు కార్డుల ద్వారా కూడా ఈ మొబైల్ పైన పలు ఆఫర్లు ఉన్నట్లుగా సమాచారం.
LAVA yuva PRO :
లావా యువ ప్రో స్మార్ట్ మొబైల్ 6.5 అంగుళాల డిస్ప్లే తో కలదు. ఈ మొబైల్ డిస్ప్లే IPS డిస్ప్లే ని కలిగి ఉంటుంది ఈ స్మార్ట్ మొబైల్ మీడియా టెక్ ఆక్టో ఫోర్ ప్రాసెస్ తో కలదు. ఇక 3GB ram +32 స్టోరేజ్ తో కలదు. మెమొరీ కార్డు సపోర్టింగ్ కూడా చేస్తుంది ఇక ఈ మొబైల్ కెమెరా సెట్ అప్ విషయానికి వస్తే లావా యువ ప్రో వెనుక 13 mp మెగా పిక్సెల్ కెమెరా, HDR కెమెరాను రాత్రి వేళలో కూడా పిక్చర్ క్వాలిటీ కోసం అమర్చడం జరిగింది. సెల్ఫీ ప్రియుల కోసం 8 mp కెమెరా కలదు. బ్యాటరీ విషయానికొస్తే 5000 MAH సామర్థ్యంతో 10W పాస్ట్ చార్జింగ్ కలదు.A

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: