బుల్లి పిట్ట: తక్కువ ధరకే బిగ్ బిలియన్ లో స్మార్ట్ టీవీ..!!

Divya
ఇటీవల కాలంలో ఆన్లైన్ ప్రాజెక్టులకు ఎక్కువ మక్కువ చూపుతున్నారు కస్టమర్లు. ఇక అంతేకాకుండా పలు బ్రాండెడ్ లకు సంబంధించి పలు ఆఫర్లను కూడా టెక్ దిగ్గజ సంస్థలు ప్రకటిస్తూ ఉన్నారు.. ముఖ్యంగా పలు ప్రత్యేకమైన ఆఫర్లను కూడా ప్రకటిస్తూ ఉండడంతో కస్టమర్లు కూడా ఇలాంటి వాటిని కొనడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇప్పుడు తాజాగా ఇన్ఫినిక్స్ బ్రాండ్ నుంచి మార్కెట్లోకి ఒక స్మార్ట్ టీవీ విడుదలయ్యింది. ఇది 50 ఇంచుల డిస్ప్లే తో 4K స్మార్ట్ టీవీ గా విడుదల చేయడం జరిగింది ఈ స్మార్ట్ టీవీ ఫ్లిప్ కార్ట్ లో కస్టమర్లు తీసుకోవడానికి అందుబాటులో ఉండనుంది.

ఈ స్మార్ట్ టీవీ బ్రెజిల్ లెస్ డిజైన్ ,డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా కలిగి ఉన్నది. అలాగే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం తో కూడా ఈ స్మార్ట్ టీవీ రన్ అవుతుందట. ఈ స్మార్ట్ టీవీలో దాదాపుగా 122 కలర్లను సైతం నిక్షిప్తం చేసినట్లుగా తెలుస్తోంది.94% స్క్రీన్ టు బాడీ రేషియో తో ఈ స్మార్ట్ టీవీ డిజైన్ చేయడం జరిగింది. ఇందులో సరికొత్త టెక్నాలజీని కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ టీవీ 1.5 GB RAM+16 GB స్టోరేజ్ మెమొరీ కలదు.

ఇందులో డిఫాల్ట్ గా అమెజాన్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వంటి కొన్ని ఓటీటి యాప్స్ కూడా కలవు. ఇక గేమింగ్ ప్రియులకు కూడా ఈ ఈ స్మార్ట్ టీవీ బాగా ఉపయోగపడుతుంది. వాయిస్ సెర్చింగ్ సపోర్ట్ చేసే స్మార్ట్ రిమోట్ కూడా ఈ టీవీ కి కలదు అలాగే వైఫై, బ్లూటూత్, 3HDMI పోర్టులతోపాటు రెండు యూఎస్బీ పోర్టులు కూడా కలదు. ఈ స్మార్ట్ టీవీ ధర విషయానికి వస్తే రూ.24,999 రూపాయలకి ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో లభిస్తున్నది. ఇక బిగ్ బిలియన్ డేస్ లో ఈటీవీ లభించనున్నట్లుగా తెలుస్తోంది అలాగే పలు బ్యాంకు కార్డులపై కూడా డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: