ఇతని తెలివికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ఏం చేసాడో తెలుసా?

praveen
దేశంలో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యులు అందరూ కూడా బెంబేలెత్తిపోతున్నారు అన్న విషయం తెలిసిందే. పెట్రోల్ ధరలు పెంచకండి మహాప్రభో అంటూ  ప్రభుత్వాలను వేడుకున్నా ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. ఇలాంటి సమయంలోనే ఇక పెట్రోల్ బాదుడు నుంచి తప్పించుకోవడం ఎలా అని వినూత్నంగా ఆలోచిస్తున్నారు ప్రతి ఒక్కరు. ఇక పెట్రోల్ బాదుడు నుంచి తప్పించుకోవాలంటే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి వాహనాలను వదిలేసి సైకిల్ పై ప్రయాణించడం.. ఇటీవలి కాలంలో ఇలాంటిది అసలు కుదరదు. మరొకటి ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేయడం.

 ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరూ రెండో ఆప్షన్ ఎంచుకుంటున్నారు. ఎలక్ట్రికల్ వాహనాలను కొనుగోలు చేసి ఇక పెట్రోల్ బాధల నుంచి తప్పించుకుంటూ ఉన్నారు. అయితే  ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలి అన్న తక్కువ ధర లేని పరిస్థితి ఉంది. లక్షలు ధారపోస్తే కానీ ఎలక్ట్రికల్ బైక్ కొనలేని పరిస్థితి. దీంతో సామాన్యులకు ఇది కూడా భారంగానే మారిపోతుంది. ఇలాంటి సమయంలోనే కొంతమంది వినూత్నంగా ఆలోచిస్తూ సొంతంగా ఎలక్ట్రికల్ వాహనాలను తయారు చేసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ఇటీవలే రాజస్థాన్ కు చెందిన 26 ఏళ్ల యువకుడు కూడా ఆలోచనకు పదును పెట్టి సరికొత్త ఆవిష్కరణలకు ప్రాణం పోసాడు.

 దినేష్ అనే 26 ఏళ్ల వ్యక్తి ఏకంగా ఈ- బైక్ ని తయారు చేశాడు. పెట్రోల్ ధరలు భారీగా పెరిగి పోతూ ఉండటం.. బయట ఎలక్ట్రికల్ వాహనాలు కొనాలంటే లక్షలు అవసరం ఉన్న నేపథ్యంలో తన పాత బైక్ను తీసుకొని పలు మార్పులు చేసి మూడు నెలల్లో ఎలక్ట్రికల్ బైక్ గా మార్చాడు. ఇందుకోసం 50 నుంచి 60 వేల రూపాయలు ఖర్చుపెట్టాడు సదరు యువకుడు. అయితే ఒకసారి ఛార్జింగ్ పెడితే 50 కిలోమీటర్ల వరకు ఈ బైక్ ప్రయాణిస్తోందని చెబుతున్నాడు. ఇక ఒకసారి ఛార్జింగ్ చేసినందుకుగాను 15 నుంచి 20 రూపాయలు ఖర్చు అవుతుండగా ప్రమాదాలను నివారించేందుకు గేర్, స్పీడోమీటర్,  బ్రేక్ లకు సెన్సార్లను అమర్చాడు ఈ విద్యార్థి. కాగా దినేష్ ప్రస్తుతం డిఫార్మసీ చదువుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: