బుల్లి పిట్ట: మార్కెట్లోకి స్మార్ట్ వాటర్ బాటిల్ విడుదల.. ఫీచర్స్ అదుర్స్..!!

Divya
ప్రస్తుతం ఎక్కువగా స్మార్ట్ గాడ్జెట్ హవానే నడుస్తోందని చెప్పవచ్చు.. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపయోగించే టివి ఎక్కువగా స్మార్ట్ గానే ఉండే విధంగానే ఆలోచిస్తూ ఉన్నారు ప్రజలు. టీవీ దగ్గర నుంచి మొదలు కారు వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో ఉపయోగించే బలుపులు, కాలింగ్ బెల్ తదితర వస్తువులు అన్ని ఎక్కువగా స్మార్ట్ రూపంలోకి మారి పోయాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఎలక్ట్రిక్ దిగ్గజానికి చెందిన యాపిల్ సంస్థ ఒక స్మార్ట్ వాటర్ బాటిల్ ని కూడా తీసుకు వచ్చింది. అయితే ఈ పేరుకు తగ్గట్టుగానే ఈ వాటర్ బాటిల్ చాలా స్మార్ట్ గా పని చేస్తుందట.
ప్రస్తుతం అమెరికాలో ఈ ఫీచర్స్ తో పాటు అందుబాటులోకి ఉన్నది.. అయితే త్వరలోనే ఇతర దేశాలలో ఈ బాటిల్ అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. హైడ్రేట్ స్పార్క్ అనే కంపెనీ తో భాగస్వామ్యం అయి యాపిల్ సంస్థ ఈ సరికొత్త వాటర్ బాటిల్ ను విక్రయిస్తోందట. ఈ బాటిల్ సహాయంతో యాపిల్ యూజర్స్ హెల్త్ యాప్ ద్వారా కనెక్ట్ చేసుకుని.. ఈ బాటిల్ కు అందించిన ఒక సరికొత్త ఎల్ఈడీ లైట్లు ఆధారంగా ఈ రోజుల్లో మనం ఎన్ని సార్లు నీటిని తాగాలి అనే దానిని పూర్తి వివరాలను అందిస్తుందట.
ఈ బ్లూటూత్ ఆప్షన్ ఆధారంగా హైడ్రో స్పార్క్ యాప్ ను అనుసంధానం అయ్యే విధంగా ఈ బాటిల్ ను తయారుచేయబడింది. ఇక అంతే కాకుండా రోజులో ఎంత నీరు తాగుతున్నారు అనే వివరాలను కూడా ఈ యాప్ లో పొందుపరచడం జరుగుతుందట. ఐఫోన్, ఐప్యాడ్, యాపిల్ వాచ్ లకు ఈ బాటిల్ ను కనెక్ట్ చేసుకోవచ్చు.. ఈ వాటర్ బాటిల్ ధర విషయానికి వస్తే స్టీల్తో రూపొందించిన బాటిల్ ధర..6,129 అందుబాటులో ఉన్నది.. ప్లాస్టిక్ బాటిల్ ధర 4,596 ఉన్నది. ఈ వాటర్ బాటిల్ గ్రీన్ , బ్లాక్ కలర్ లో అందుబాటులో ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: