కంప్యూటర్ యుగం : అమెరికాలో.. మరో సంక్షోభం..!

సాంకేతికత వైపు ప్రపంచం అడుగులు వడివడిగా వేస్తున్న తరుణం ఇది. అయితే దానిగురించి కూడా అదే సాంకేతికతకు ప్రాణం పోసిన వాళ్ళే దాని గురించి హెచ్చరించారు కూడా, ఒకనాడు మనిషిని శాసించే యంత్రం తయారవుతుంది అని. అలాగే ఉంది ప్రస్తుత పరిస్థితి. ఎక్కడ చూసినా అన్ని యంత్రాలే. నీ వస్తువు నువ్వు వాడుకోవాలన్నప్పటికీ దాని అనుమతి ఉండాల్సిన అవసరం ఉంది. అంతలా ప్రతిచోటా సాంకేతికత రూపంలో యంత్రాలు వచ్చేశాయి. గతంలో అన్ని మనిషి చేసే పనులు అవన్నీ. కానీ యాంత్రీకరణ మొదలవడం అలాగే అవన్నీ కంప్యూటర్ అనే మరో యంత్రంతో అనుసంధానం కావడం జరిగిపోయాయి.

ఇక్కడే సమస్య మొదలైంది. ఒక్కసారి పొరపాటున ఆ యంత్రం ఆగిపోతే దానికోసం పని అంతా ఆగిపోవాల్సిందే. సదరు సాంకేతిక నిపుణులు వచ్చి దానిని బాగుచేసే వరకు ఆయా పనులు ఆగిపోవాల్సిందే. అలాంటి పరిస్థితులు కూడా ఉన్నప్పటికీ, వాటి శాతం అతి తక్కువ అని సాంకేతిక నిపుణులు చెపుతూ, వాటిని అందరికి అంతకడుతున్నారు. ప్రజలు కూడా తమ పని సులభంగా అయిపోతుంది కదా అని వాటికే బానిసలైపోతున్నారు. ఒక టీవీ, ఒక మొబైల్, వీడియో గేమ్ ఇలా ఎన్నో ఇప్పటికే మనిషిని తమ బానిసను చేసేసుకున్నాయి. ఇక పెద్ద పెద్ద సంస్థలలో ఇలాంటి యంత్రాలు మొరాయిస్తే, పని మొత్తం ఆగిపోవడం అక్కడక్కడా చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో ఒక్కసారి వచ్చే ఈ సమస్యతో యంత్రాలు సరికాదు అనడం కూడా సరైన విషయం కాదు కాబట్టి అందరు వాటినే వాడుతున్నారు.

తాజాగా అమెరికాలో కూడా ఒక ఛీజ్ తయారీ సంస్థలో యంత్రం ఆగిపోవడం తో పని ఆగిపోయింది. ఉత్పత్తి తగ్గిపోయింది. అక్కడ అన్నిటిలో ఛీజ్ వాడకం ఉంటుంది కాబట్టి, ఒక్కసారిగా దాని కొరత వచ్చేసింది. దానితో దేశంలో మరో సంక్షోభం, ఇలాంటివి తప్పవు అప్పుడప్పుడు. ఆయా సాంకేతికతను అందిపుచ్చుకున్నప్పుడే ఇలాంటి సమస్య ఏదో ఒక రోజు వస్తుంది అనేది తెలిసిందే. అందుకే ఈ సాంకేతికతను ఆయా సమయాలకు అనుగుణంగా నిర్వహణ చేస్తూ ఉంటారు. కానీ ఈసారి లోపం లేదా సమస్య సంస్థలో లేదు, బయట వారు ఎవరో  దానిపై సైబర్ అట్టాక్ చేయడం వలన వచ్చింది. ఇలాంటివి కూడా బహుశా ప్రశ్చన్న యుద్ధాలుగా చెప్పవచ్చు. ఇదేదో ఆహారం గురించి కాబట్టి సరిపోయింది, మరొకటి అయితే ఖచ్చితంగా ప్రమాదానికి దారితీసేది. దీనిపై అమెరికా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: